పెళ్లి సందD సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శ్రీ లీల.ఇలా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి.
సుమారు అరుడజనకు పైగా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీ లీలా యంగ్ హీరోల నుంచి మొదలుకొని సీనియర్ హీరోల వరకు తనే మొదటి ఛాయిస్ గా నిలిచిపోయారు.తాజాగా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నటువంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండిపోయారు.
ఇలా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా ముందు వరుసలో ఉంటారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా ఒక అనాధ ఆశ్రమాన్ని సందర్శించిన శ్రీ లీల అక్కడ ఉన్నటువంటి చిన్నారులతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నారు.ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఈ రోజు నా జీవితంలో మరుపు రాని రోజుగా నిలిచిపోతుంది.జీవితంలో ఇలాంటివి చాలా విలువైనవిగా నిలుస్తాయని భావిస్తున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
ఈ క్రమంలోని ఫోటోలను షేర్ చేస్తూ ఇదేనా చిన్ని సమూహం పెద్ద కళలతో ఉన్న నా చిన్న పిల్లలు.ఈ క్షణాలు చాలా విలువైనవని వారిని చూసేవరకు మీకు తెలియదు.ఇప్పటివరకు నా జీవితంలో సంతోషంగా గడిపిన రోజు ఇదే.వారితో కలిపి ఆటలు, పాటలు, డాన్స్ చేయడం ప్రేమతో నిండిన వారి హృదయంతో ఇలా కలిసి ఉండడం జీవితాంతం నాకు గుర్తుండిపోతుంది అంటూ ఈమె తెలియజేశారు.అలాగే మీరు కూడా మీ అత్యంత ప్రేమను వారికి పంచండి వారానికో నెలకొకసారి వారిని కలిసి వారితో పాటు భోజనం చేసి మీ ప్రేమను వారికి పంచండి అని తెలిపారు.ఇలా మీరు వారితో కలిసి దిగిన ఫోటోలను నిండు మనసుతో # Hereforyou ను ట్యాగ్ చేయండి అంటూ ఈ సందర్భంగా ఈమె అభిమానులను ఉద్దేశిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.