మల్లేశం సినిమా ద్వారా హీరోగా పరిచయమైనటువంటి ప్రియదర్శి ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో కమెడియన్ గా నటించి మెప్పించారు.వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం సినిమా ద్వారా మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మార్చి మూడవ తేదీ విడుదలయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.కావ్య కళ్యాణ్ రామ్ ప్రియదర్శి జంటగా నటించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో మరోసారి ప్రియదర్శి అందరి నోళ్ళల్లో నానుతున్నారు.

బలగం సినిమాలో సాయి పాత్రలో నటించిన ప్రియదర్శి ఈ పాత్రకు ప్రాణం పోసారని చెప్పాలి.ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో తాత మీదున్న ప్రేమను చూపించే సన్నివేశంలో ఆడియెన్స్‌ను ఏడిపించేస్తాడు.ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తన కుటుంబ సభ్యులు గుర్తుకు వచ్చే విధంగా ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు.ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమా విజయం పై ప్రియదర్శి ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ సినిమా విజయాన్ని తనకే అంకితం చేస్తున్నానంటూ ఈయన చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ప్రియదర్శి స్పందిస్తూ.మమ్మీ.ఫిల్మ్ హిట్ అయింది.
ఈ సినిమాను నీకు చూపించాలని నా మనసు కోరుతోంది.ఒక్కసారి కిందికి రా.ఈ బలగం సినిమా నీకోసమే అంటూ ఈయన పోస్ట్ చేశారు.అయితే ఈయన ఈ సినిమాని తన అమ్మకు అంకితం చేశారని అందరూ భావించారు.
అయితే తాను తన తల్లి కాదని అత్తయ్య అంటూ ఈయన మరొక పోస్టు ద్వారా తెలిపారు.తాను నటిస్తున్న బలగం సినిమా షూటింగ్ సమయంలోనే తన అత్తయ్య గారు చనిపోయారని, అందుకే ఈ సినిమా విజయాన్ని తన అత్తయ్యకు అంకితం చేస్తున్నాను అంటూ ఈయన ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.







