దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ తీపికబురు అందించింది.విషయం ఏమంటే, ప్రముఖ వాహన తయారీ కంపెనీ ఐనటువంటి టాటా మోటార్స్‌కు చెందిన టాటా ఏస్ ఈ వీ వాహన కొనుగోలుకు సులభంగా రుణాలు ఇస్తున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొంది.
దీంతో ఎవరైనా టాటా ఏస్ ఈ వీ కొనుగోలు చేయాలని అనుకుంటే ఇపుడు సులభంగానే రుణం పొందొచ్చు.టాటా మోటార్స్ తాజాగా ఎస్‌బీఐతో ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
ఇందులో భాగంగానే ఎస్‌బీఐ టాటా ఏస్ ఈవీ కొనుగోలు చేయాలని భావించే వారికి తేలికగా లోన్స్ అందించనుంది.
ఇక టాటా ఏస్ ఈ వీ ఫీచర్ల విషయానికొస్తే ఒక్కసారి ఫుల్‌గా చార్జ్ చేస్తే.
ఏకంగా 154 కిలోమీటర్లు పరుగెడుతుంది.ఈ వెహికల్‌లో27 కేడబ్ల్యూ మోటార్ వుంది.
దీని పవర్ 36 హెచ్‌పీ.ఈ టాటా ఏస్ ఈ వీ ప్రారంభ ధర రూ.9.99 లక్షలు. బీ2బీ, బీ2సీ బిజినెస్ కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారు.ఎలక్ట్రిక్ వేరియంట్ వల్ల కొనుగోలు దారులు ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు.ఫ్యూయెల్ ఖర్చు అనేది మీకు ఉండదు.సిటీలో సరుకు రవాణా కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు.

ఇకపోతే ఇక్కడ కొన్ని కండిషన్స్ వున్నాయి.తీసుకున్న రుణాన్ని మాత్రం ఆరేళ్ల లోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.బ్యాంక్ మీకు దాదాపుగా 90 శాతం ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తుంది.దాదాపు 8.99 లక్షల దాకా లోన్ పొందొచ్చు.అంటే ఓ రూ.లక్ష రూపాయిలు మీ చేతిలోవి పెట్టుకుంటే ఇంటికి టాటా ఏస్ ఈ వీ తెచ్చుకోవచ్చు.మిగతా మొత్తాన్ని నెలవారీ ఈఎంఐ రూపంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది.
మీరు డౌన్ పేమెంట్ ఎక్కువ చెల్లిస్తే.అప్పుడు నెలవారీ ఈఎంఐ కూడా దిగి వస్తుంది.
చేతిలో డబ్బులు లేని వారు ఈ ఆఫర్ పొందొచ్చు.

గమనిక: టాటా మోటార్స్, ఎస్‌బీఐ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా కస్టమర్లు ఎలాంటి తనఖా లేకుండా సులభంగా లోన్ పొందొచ్చు.టాటా మోటార్స్ వెబ్‌సైట్‌లోకి మీరు టాటా ఏస్ ఈవీని బుక్ చేసుకోవచ్చు.







