ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ లో పర్యటించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ లో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు.గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు.

 Paleru Brs Mla Kandala Upender Reddy Visited Chegomma, Kusumanchi Mandal, Kham-TeluguStop.com

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఉపేందర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇక్కడ ఉన్న వాళ్లంతా ఈ ప్రాంత బిడ్డలైనప్పుడు, నాయకులు పరాయి వాళ్ళు కావాలా అంటూ ఆయన ప్రశ్నించారు.

పాలన మనకు చేత కాదా అని మట్టికైనా ఇంటోడు కావాలి అని సామెతను ఆయన ఉదహరించారు .ఈ ఊరికి ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్లు వస్తున్నారని వాళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు వైయస్ షర్మిల ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.నా ఆశయం ఈ ప్రాంత వాసిగా ప్రజలకు సేవ చెయ్యాలనేదే ఉదేశ్యం అన్నారు.ఎంజాయ్ చేయాలి అనుకుంటే నాకు చాలా ఉంది కానీ సేవ చేయాలనేదే నా అభిమతమని అందుకే తనతో పాటు తన సతీమణి ప్రతి గ్రామం వెళ్తు ప్రతి ప్రతి వారిని కలుస్తున్నామని కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube