జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో పవిత్ర ఒకరు కాగా పవిత్ర చేసిన స్కిట్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది.జబర్దస్త్ షోలోకి ఎలా వచ్చాననే విషయాల గురించి పవిత్ర వెల్లడిస్తూ పిలవని పెళ్లికి వెళ్లడం ద్వారా తాను జబర్దస్త్ షోకు వచ్చానని అన్నారు.
జబర్దస్త్ అప్పారావు కొడుకు రిసెప్షన్ కు ఇన్విటేషన్ లేకుండా వెళ్లానని పవిత్ర తెలిపారు.
నా ఫ్రెండ్ తో కలిసి రిసెప్షన్ కు వెళ్లిపోయానని అక్కడ అదిరే అభి, కెవ్వు కార్తీక్, అదుర్స్ ఆనంద్ అందరూ ఉన్నారని డిన్నర్ టైమ్ లో అందరితో కూర్చొని జోక్స్ వేసుకుంటూ ఉండగా ఆ సమయంలో నన్ను ఆనంద్ గారు, కెవ్వు కార్తీక్ గారు చూశారని పవిత్ర తెలిపారు.
వాళ్లిద్దరి నంబర్లు నేను తీసుకున్నానని రైటర్ గా పని చేస్తావా అని వాళ్లు అడిగారని ఆమె తెలిపారు.జబర్దస్త్ లో ఒక చిన్న క్యారెక్టర్ కోసం నేను వెళ్లానని ఆ పాత్రకు డైలాగ్స్ కూడా లేవని పవిత్ర అన్నారు.

నా పర్ఫామెన్స్ రోజా మేడమ్ కు నచ్చడంతో జడ్జిమెంట్ లో పాజిటివ్ కామెంట్లు వచ్చాయని పవిత్ర పేర్కొన్నారు.ప్రస్తుతం రోహిణి అక్క టీమ్ లో చేస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.ఈ విధంగా జబర్దస్త్ లో నా ప్రయాణం మొదలైందని ఆమె తెలిపారు.జబర్దస్త్ డైరెక్టర్లు బాగా సపోర్ట్ చేయడంతో ఈ స్థాయికి వచ్చానని పవిత్ర అన్నారు.పాగల్ పవిత్ర వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

పాగల్ పవిత్ర పారితోషికం సైతం భారీ రేంజ్ లో పెరిగిందని తెలుస్తోంది.పాగల్ పవిత్రకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.పాగల్ పవిత్ర కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.







