సమ్మర్ సీజన్ ప్రారంభం కాబోతోంది.మార్చి నెల వచ్చిందో లేదో ఎండలు ఊపందుకున్నాయి.
ఈ సీజన్ లో అధిక చెమటలు, ఇన్ఫెక్షన్, చుండ్రు తదితర కారణాల వల్ల తలలో విపరీతమైన దురద పుడుతుంటుంది.ఆ దురద కారణంగా ఎంతో అసౌకర్యానికి గురవుతుంటారు, పనిపై ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది.మీకు కూడా తలలో దురద తీవ్రంగా వేధిస్తోందా.? అయితే చింతించకండి ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే తలలో దురద అన్న మాటే అనరు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ రెమెడీ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక కప్పు వేపాకులను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ లో కడిగి పెట్టుకున్న వేపాకులు, ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ తేనె, నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా ఓ అద్భుతమైన హెయిర్ టోనర్ సిద్ధమవుతుంది.ఈ హెయిర్ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.స్కాల్ప్ కు ఒకటికి రెండుసార్లు తయారు చేసుకున్న హోమ్ మేడ్ టోనర్ ను స్ప్రే చేసుకోవాలి.
రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
మూడు రోజులకు ఒకసారి ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే తలలో ఇన్ఫెక్షన్ తగ్గు ముఖం పడుతుంది.చుండ్రు మాయమవుతుంది, స్కాల్ప్ క్లీన్‌గా, ఆరోగ్యంగా మారుతుంది.తద్వారా తలలో దురద వేధించకుండా ఉంటుంది.
కాబట్టి ఎవరైతే తలలో దురద సమస్యతో తీవ్రంగా మదన పడుతున్నారో వారు తప్పకుండా పైన చెప్పిన ఎఫెక్టివ్ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.