తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ భర్త అనుమానించాడు.
ఈ క్రమంలోనే అన్వర్ అనే యువకుడి ఫోటోను సోషల్ మీడియాలో పెట్టిన భర్త RIP అని పెట్టాడు.
పోస్ట్ చూసిన సదరు యువకుడు అన్వర్ తన స్నేహితులతో కలిసి బెంగళూరులో ఉన్న భర్తను కిడ్నాప్ చేశాడు.
అనంతరం చంద్రగిరికి తీసుకువచ్చి మూత్రం పోయించి, గుండు గీయించి విచక్షణారహితంగా దాడి చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రంగంలోకి దిగిన పోలీసులు అన్వర్ తో పాటు ఆయన స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.