తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ షోతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది యాంకర్ రష్మి.
ఈ ముద్దుగుమ్మకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.వెండితెరపై పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమె అంతగా కలిసి రాకపోవడంతో బుల్లితెరకే పరిమితం అయిపోయి ప్రస్తుతం యాంకర్ గా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
ఒకవైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లు చేస్తూ అందాలతో యువతకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.
అలాగే జంతువులకు సంబంధించిన ఎటువంటి విషయమైనా కూడా రష్మీ సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఉంటుంది.అంతేకాకుండా జంతువుల విషయంలో ఆమె ఎంతవరకు అయినా కూడా వెళుతుంది.కేవలం జంతువుల విషయంలోనే కాకుండా సమాజంలో జరుగుతున్న అరాచకాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.
కొన్ని కొన్ని సార్లు రష్మీ వివాదాల్లో కూడా నిలుస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా రష్మీ పాల ఉత్పత్తులపై వివాదాస్పద ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.
తాను పాల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం మానేశాను అని రష్మి తన ట్వీట్లు రాసుకొచ్చింది.
ఇక ఆ ట్వీట్ పై స్పందించిన నెటిజన్స్ 2019లో రష్మీ ఓపెన్ చేసిన ఐస్ క్రీం షాప్ వీడియో స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తూ.ఈ సెలబ్రిటీలందరూ ఇంతే.డబ్బుల కోసం ఏమైనా చేస్తారు.
తర్వాత ఇలా పోస్టులు పెడతారు అని కామెంట్స్ చేశారు.ఇక ఆ కామెంట్స్ పై స్పందించిన రష్మీ.
అవును.గతంలో తెలియక కొన్ని తప్పులు చేశాను.
కానీ నేను కొన్నాళ్ల నుండి పాలు తాగడం మానేశాను.పాలు తాగడం వలన నా చర్మంపై అనారోగ్య ప్రభావం పడటం నేను గమనించాను.
అయితే.ఫ్యాక్టరీలలో పాల ఉత్పత్తుల తయారీ విధానం గురించి తెలుసుకున్న తర్వాత పూర్తిగా వాటిని ప్రమోట్ చేయడం ఆపేశాను అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం రష్మీ చేసిన ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.