ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది.అయితే ఈ పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేసింది మొదట దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
బాహుబలి వన్ సినిమాతో టాలీవుడ్ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు దర్శకుడు రాజమౌళి.బాహుబలి లో అనగా నటించిన భల్లాల దేవా అలియాస్ రానా గురించి మనందరికీ తెలిసిందే.
రానా బాహుబలి సినిమాతో భారీగా క్రేజ్ ను ఏర్పరచుకున్నాడు.ఇది ఇలా ఉంటే రానా ప్రస్తుతం బాబాయి వెంకటేష్ తో కలసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

అందుకు సంబంధించిన వెబ్ సిరీస్ మార్చి 15 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నాడు రానా.ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా మాట్లాడుతూ.టాలీవుడ్ హీరోల గురించి బాలీవుడ్ అభిమానులు ఏమనుకుంటున్నారో చెప్పుకొచ్చాడు.మనం సినిమాలను భాష పేరుతో వేరు చేసుకుంటున్నాం.
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు హిందీలో మంచి విజయాలు సాధిస్తున్నాయి.ఇక నా రెండో మూవీని బాలీవుడ్ లోనే చేశాను.
భాష పేరుతో సినిమాని వేరేచేసే పరిస్థితులను చెరిపే రోజులు వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు రానా.

అయితే హీరో రానా కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.రానా మాట్లాడుతూ ఓ సారి బాలీవుడ్ కు వెళ్లినప్పుడు ఓ మిత్రుడికి బాహుబలి సినిమా గురించి చెప్పాడట.ఆ సినిమాలో నేను, హీరో ప్రభాస్ చేస్తున్నాం అని చెప్పగా.
ప్రభాస్ ఎవరు అని అడిగాడట.దానికి రానా ఒక్కసారిగా షాక్ అయ్యాడట.
ఇక ప్రభాస్ నటించిన కొన్ని సినిమా పేర్లను తన మిత్రుడికి చెప్పి వివరించే ప్రయత్నం చేశాడట రానా.కానీ అతడు ప్రభాస్ నటించిన ఒక్క సినిమా చూల్లేదని, నాకు టాలీవుడ్ లో తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి చిన్ను భర్త ఒక్కరే అని చెప్పాడు.
చిన్ను అంటే ఎవరో రానాకి కొద్దిసేపు దాక అర్థం కాలేదట.తర్వాత తెలిసింది చిన్ను అంటే నమ్రత శిరోద్కర్ అని.
దాంతో నమ్రత భర్తగా మహేశ్ బాబు తెలియడం ఏంటి? అని షాక్ అయ్యాడట రానా.ఇక అప్పుడు రానా ఓ స్ట్రాంగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడట.
కొన్ని సంవత్సరాలు ఆగు మా టాలీవుడ్ ఆర్మీ అంత మీ బాలీవుడ్ పై దండయాత్ర చేస్తుంది అని రానా అన్నాడు.ప్రస్తుతం ఇదే నిజం అవుతోంది అని రానా ఇటీవల అతడిని కలిసినప్పుడు చెప్పగా సంతోషించాడట.







