టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ గురించి మనందరికీ తెలిసిందే.టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటించిన లై సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత చల్ మోహన్ రంగ, పేట, డియర్ మేఘా, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువఅయింది.ఇది ఇలా ఉంటే తాజాగా మేఘా ఆకాష్ ఇంట్లో ఒక విషాదం నెలకొంది.
మేఘా ఆకాష్ వాళ్ళ బామ్మ తుది శ్వాస విడిచారు.ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ తన బామ్మ మరణాన్ని తలుచుకోలేక ఎమోషనల్ గా ట్వీట్ కూడా చేసింది.

ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.ఇక ఆ పోస్టులో మేఘా ఆకాష్ ఈ విధంగా రాసుకొచ్చింది.డియర్ అమ్మమ్మ.నువ్వు లేకుండా ఎలా బతకాలో నాకు తెలియడం లేదు.ఇక ముందు నేను ఎలా బతుకుతానో కూడా నాకు తెలియడం లేదు.అయితే నేనూ నీలాంటి దాన్నే కాబట్టి ఎలాగైనా బతికేస్తాననకుంటున్నా.
నువ్వు ఎంతో సరదాగా ఉండే దానివి.ఎంతో దయతో మెలిగేదానివి.
ఎంతో మంచిదానివి.నువ్వు అందరి కడుపులు నింపేందుకు ప్రయత్నిస్తుంటావు.
అందరి మొహం మీద నవ్వులు పూయించేందుకు ప్రయత్నిస్తుంటావు.రోజు నీతో మాట్లాడే మాటలు, చేసే గాసిప్పులు ఇకపై ఉండవని తలుచుకుంటూనే బాధేస్తోంది.

ఇప్పుడు నువ్వు నీ మనిషి దగ్గరకు వెళ్లావ్.ప్రతీ ఆదివారం మనకు ఎంతో సరదాగా గడిచేది.ఇకపై ఆదివారాలు అలా ఉండవు.మా అందరిలోనూ నిన్ను చూసుకుంటాం.మాలోనే నువ్వు జీవిస్తూ ఉంటావు.నీ ఆత్మకు శాంతి చేకూరాలి అని అని రాసుకొచ్చింది మేఘా ఆకాశ్.
ఈ ముద్దుగుమ్మ తెలుగులో తక్కువ సినిమాలలో నటిస్తున్నప్పటికీ కోలీవుడ్ లో మాత్రం వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.ప్రస్తుతం ఈ బ్యూటీ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమాలో నటిస్తోంది.







