గవర్నర్ పై కోర్టుకెక్కిన తెలంగాణ సర్కార్

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన పది బిల్లును గవర్నర్ ఉద్దేశపూర్వకంగా పెండింగ్ లో పెట్టారని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో రిప్ పిటిషన్ దాఖలు చేసింది ….ఆ బిల్లులకు సంబంధించి సంబంధిత మంత్రులు, అధికారులు గవర్నర్ ని కలిసి మౌఖికంగా అనుమానాలను నివృత్తి చేసిన తర్వాత బిల్లులను ఆమోదిస్తామని చెప్పి కూడా గవర్నర్ ఇంతవరకు ఆ పని చేయలేదని, ఈ చర్య కచ్చితంగా రాజ్యాంగ విధి నిర్వాహణలో విఫలమైనట్టుగా భావించాలని ,,ఇది చట్ట వ్యతిరేక చర్యగా గుర్తించి పెండింగ్ బిల్లులను ఆమోదించే విధంగా గవర్నర్కు ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ తరఫున రిట్ పిటిషన్ దాఖలు చేసిన సిఎస్ శాంతి కుమారి తరపు లాయర్ తన వాదనలు వినిపించారు.

 Telangana Government Petition In Supreme Court On Governor Tamilisi Details, Tel-TeluguStop.com

పెండింగ్ బిల్లులు గురించి ఇంతకుముందు కోర్టును ఆశ్రయించినప్పుడు గవర్నర్ తరపు లాయర్ తొందర్లోనే అవన్నీ క్లియర్ చేస్తామని కోర్టుకు తెలిపారని, కానీ ఆ పని ఇంతవరకు ముందుకు జరగలేదని అందువల్ల మరొకసారి కోర్టు ముందుకు వచ్చామని తన వాదనలు వినిపించారు ….ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా గవర్నర్ తరపు కార్యదర్శి మరియు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తావించారు….

Telugu Cm Kcr, Bills, Raj Bhavan, Supreme, Telangana-Telugu Political News

ఈ విషయంపై శుక్రవారం స్పందించిన గవర్నర్ ప్రభుత్వ కార్యదర్శి కి ఢిల్లీకి చేరడానికి ఉన్న సమయం పక్కనే ఉన్న రాజభవన్ కి రావడానికి లేదని ఢిల్లీ కన్నా రాజ్ భవన్ తక్కువ దూరం ఉందని, ప్రోటోకాల్ పక్కన పెడితే కనీసం మర్యాదపూర్వకంగానైనా కలవాలనుకోలేదని ,,అధికారిక పర్యటన కన్నా స్నేహపూర్వకమైన వాతావరణంలోని పనులు తొందరగా అవుతాయని ట్వీట్ చేశారు….దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మధ్య కోల్డ్ వార్ చాలా కాలం నుంచి జరుగుతుందని

Telugu Cm Kcr, Bills, Raj Bhavan, Supreme, Telangana-Telugu Political News

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం గళం విప్పినప్పటినుంచి గవర్నర్ ముఖ్యమంత్రి సంబంధాలు మరింత దిగజారాయని అందుకే గవర్నర్ సాధారణ పరిపాలనకు సంబంధించిన చాలా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చికాకులు కలిగిస్తున్నారని ఈ వ్యవహారాలని గమనిస్తున్న వారు అభిప్రాయం వ్యక్తం చేస్తారు.ఏది ఏమైనప్పటికీ రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహిస్తున్న వారు వ్యక్తిగత ఈగోల కన్నా ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే బహుశా ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పవచ్చు ….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube