సైబర్ నేరగాళ్ల దారుణాలకు ఎవరైనా బలి కావాల్సిందేనా.వీరి కన్ను పడితే అవతలి వాళ్ళ పని అయిపోయినట్టేనా.
ఢిల్లీ నగరంలో ఒక కొత్త రకం కోసం వెలుగులోకి వచ్చింది.ఏకంగా బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీల పేరుతో నకిలీ పాన్ కార్డు, క్రెడిట్ కార్డులు తయారు చేసి లక్షలు కొట్టేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సైబర్ నేరగాళ్ల చేతికి జీఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్లు దొరికితే చాలు వాటితో సులువుగా క్రెడిట్ కార్డు పొంది మోసాలకు పాల్పడుతున్నారు.ఫిన్ టెక్ స్టార్టప్ కంపెనీ వన్ కార్డ్ కంపెనీ ఫిర్యాదుతో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఇండియాలోని సెలబ్రిటీలలో అభిషేక్ బచ్చన్, సైఫ్ అలీఖాన్, ఎంఎస్ ధోని, సోనం కపూర్, ఆలియా భట్, సచిన్ టెండూల్కర్, ఇమ్రాన్ హాష్మి ల పేరుతో నకిలీ క్రెడిట్ కార్డులు పొందినట్లు పోలీసులు తెలిపారు.
సెలబ్రిటీలకు సంబంధించిన చాలా వివరాలు గూగుల్లో లభిస్తాయి.జీఎస్టీ ఇన్ కావాలంటే మొదటి రెండు అంకెలు స్టేట్ కోడ్ ఆ తర్వాత మిగిలిన 10 అంకెలు పాన్ కార్డు నెంబర్.పుట్టిన తేదీ వివరాలు కూడా గూగుల్లో ఉంటాయి.
ఈ వివరాలతో కొత్త పాన్ కార్డ్ అప్లై చేస్తారు.వివరాలు సెలబ్రెటీవి ఫోటోలు మాత్రం మోసగాళ్లవి అన్నమాట.
వీడియో వెరిఫికేషన్ లో కూడా రిజెక్ట్ కాకుండా సరిగ్గా వీరి చిత్రాలు సెట్ చేసి జాగ్రత్త పడతారు.ఇలా పాన్ కార్డ్, ఆధార్ కార్డులను సృష్టించి వాటితో వన్ కార్డు నుండి క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసి మోసం చేశారు.క్రెడిట్ కార్డ్ పొందాక లక్షలు డ్రా చేసుకొని తిరిగి చెల్లించలేదు.ఇలా 83 నకిలీ పాన్ కార్డులు పొందినట్లు వన్ కార్డ్ సంస్థ తెలిపింది.ఢిల్లీలో కొందరు నిందితులను గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయి.