తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతున్న పేరు తారకరత్న. అతి చిన్న వయసులోనే అనంత లోకాలకు వెళ్లిపోయిన తారకరత్న మరణాన్ని అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
హాస్పిటల్ లో 23 రోజులపాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడి మృత్యువునైనా ఎదిరించి నవ్వుతూ తిరిగి వస్తారని అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో ఆశగా ఎదురు చూశారు.కానీ అభిమానులు కుటుంబ సభ్యుల ఆశలు ఆవిరి అయ్యాయి.
ఊహించని విధంగా నందమూరి తారకరత్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు.అయితే నందమూరి తారకరత్న మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
చిన్న వయసులోనే తారకరత్న ఆ విధంగా మరణించడంతో ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.మరి ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇటీవల చిన్న కర్మ సందర్భంగా తన భర్తను తలుచుకొని ఎమోషనల్ గా పోస్టులు చేసిన విషయం తెలిసిందే.
ఆ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అవి అభిమానుల మనసులను కదిలించాయి.ఇది ఇలా ఉంటే తాజాగా దశదినకర్మను నిర్వహించారు కుటుంబ సభ్యులు.ఈ దశదినకర్మను బాలయ్య బాబు దగ్గరుండి చూసుకున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా తారకరత్న దశదినకర్మకు ఆయన కుటుంబ సభ్యులు రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై తారకరత్న కు నివాళులు అర్పించారు.తారకరత్న పెద్దకర్మను తాజాగా ఫిలిం నగర్ కల్చర్ క్లబ్ లో నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ కార్యక్రమానికి నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటుగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర అలాగే రాజకీయ ప్రముఖులు చంద్రబాబు నాయుడు, విజయసాయి రెడ్డి, పురందేశ్వరి ఇతర కుటుంబ సభ్యులు సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకులు నిర్మాతలు సెలబ్రిటీలు పాల్గొన్నారు.

కేవలం వారు మాత్రమే కాకుండా నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, అలాగే సీనియర్ హీరో హీరోయిన్ రాజశేఖర్,జీవిత లు హాజరయ్యారు.ఈ క్రమంలోనే జీవిత రాజశేఖర్ తల్లి పక్కన కూర్చొని ఆమెను దగ్గరుండి ఓదార్చారు.అనంతరం బాలకృష్ణ చంద్రబాబు నాయుడు ఒకచోట కూర్చునే ఉండగా ఇంతలో అక్కడికి అలేఖ్య రెడ్డి వచ్చి బాలకృష్ణ దగ్గర కూర్చొని అతని చేతులు పట్టుకుని ఎమోషనల్ గా మాట్లాడుతూ కనిపిస్తోంది.
వీరితో పాటుగా బాలకృష్ణ కుటుంబ సభ్యులు నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇక తాజాగా పెద్దకర్మ రోజు కూడా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన భర్తని తలుచుకొని ఎమోషనల్ అయింది.







