వీర సింహా రెడ్డితో సూపర్ హిట్ అందుకున్న బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాను అనీల్ రావిపుడితో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఎన్.టి.ఆర్ తో నటించిన కాజల్ కెరీర్ లో ఫస్ట్ టైం బాలయ్యకు జోడీ కడుతుంది.ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడుతారని టాక్.
ఈ సినిమాకు సైన్ చేసే టైం లోనే కాజల్ కొన్ని కండీషన్స్ పెట్టిందట.సినిమాలో ఎక్కువ గ్లామర్ షో చేసేది లేదని అన్నదట.
అంతేకాదు తనకు చెప్పిన డేట్స్ లో తన పోర్షన్ మొత్తం కంప్లీట్ చేయాలని అన్నదట.

ప్రమోషన్స్ కు ఓకే కానీ దానికి స్పెషల్ పేమెంట్ ఇవ్వాలని అంటుందట.పెళ్లికి ముందు అమ్మడు 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకోగా అంత రెమ్యునరేషన్ ఇస్తేనే ఈ సినిమాలో నటిస్తా అన్నదట.ఈ కండీషన్స్ అన్ని ఒప్పుకునే కాజల్ బాలకృష్ణ సినిమాకు ఓకే చెప్పిందని టాక్.
పెళ్లి తర్వాత హీరోయిన్స్ అదరగొడుతుండగా వారి దారిలో కాజల్ కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది.ఓవిధంగా కాజల్ కూడా ఆ విషయంలో వెరీ లక్కీ అని చెప్పొచ్చు.







