పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘సలార్’ ఒకటి.ఈ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
కెజిఎఫ్ రెండు పార్ట్శ్ కూడా నార్త్ మేకర్స్ ను అమితంగా ఆకట్టుకుంది.మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ మరింత విజయం సాధించడంతో ప్రశాంత్ నీల్ పేరు మారుమోగి పోయింది.
కెజిఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న నీల్ వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను లైన్లో పెట్టాడు.ఇలాంటి భారీ హిట్ తర్వాత నీల్ చేస్తున్న సినిమా సలార్ కావడంతో ఈ సినిమాపై కూడా మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి.
సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.దీంతో ఈ నెలలోనే షూట్ మొత్తం పూర్తి చేయాలని ప్రభాస్ సైతం ఫిక్స్ అయ్యాడు.

ఇక ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సెన్సేషనల్ గా మారుతున్న విషయం విదితమే.తాజాగా మరో న్యూస్ వైరల్ అయ్యింది.ఈ సినిమా రిలీజ్ కాకముందే మూవీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు.కేజిఎఫ్ 2 సినిమాకు గతంలో బుక్ మై షోలో లక్షకి పైగానే ఇంట్రెస్ట్స్ సంపాదించుకున్నట్టు ఇప్పుడు సలార్ కోసం కూడా ఫ్యాన్స్ అదే రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.

దీంతో రిలీజ్ కు ముందే డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.కెజిఎఫ్ వంటి సినిమాను నిర్మించిన హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.మరి నీల్ అనుకున్న సమయానికి ఈ సినిమాను రిలీజ్ చేస్తారో లేదో వేచి చూడాలి.







