తెలుగు లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ లో చాలా పెద్ద సక్సెస్ లు సాధించాడు.ఇక వాళ్ల తమ్ముడు అయిన సాయి రామ్ శంకర్ ని హీరో గా పెట్టీ 143 అనే సినిమా తీసిన విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది.అయితే ఈ సినిమాతో నటుడి గా గుర్తింపు తెచ్చుకున్న సాయి రామ్ శంకర్ ఆ తరువాత చేసిన చాలా సినిమాలతో తన టాలెంట్ ని నిరూపించుకోలేక పోయాడు.దాంతో ఆయన ఇండస్ట్రీ లో అడపదడప సినిమాలు చేస్తున్నప్పటికీ వాటిలో ఒక్క సినిమా కూడా క్లిక్ అవ్వడం లేదు…
అయితే సాయి రామ్ శంకర్ మాత్రం హీరోగా ఒక్క హిట్ కోసం ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలే చేశాడు ఆయనకి హిట్ ఇవ్వడం వాళ్ల అన్నయ్య అయిన పూరి లాంటి టాప్ డైరెక్టర్ వల్ల కూడా కావట్లేదు అనే చెప్పాలి…
సాయిరాం శంకర్ మొదట ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాకి పూరి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.అలాగే ఇడియట్ సినిమాలో రవితేజ ఫ్రెండ్ గా ఒక చిన్న క్యారెక్టర్ లో కూడా నటించాడు.ఆ తరువాత సినిమా హీరోగా చేయాలి అని పూరి పట్టు పట్టి మరి అతన్ని హీరోగా చేశాడు.హీరో గా సక్సెస్ లు రాకపోవడం తో పూరి డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన నేనింతే సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించాడు.
ఆ పాత్ర చేసినందుకు సాయి రామ్ శంకర్ కి మంచి పేరు వచ్చింది కానీ నేనింతే కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు దాంతో సాయి ఎంత బగవ్యక్తింగ్ చేసిన అది బూడిదలో పోసిన పన్నీర్ లా అయింది…సాయి రామ్ శంకర్ ఇప్పుడు కూడా ఏదో ఒక వెబ్ సీరీస్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ ని మాత్రం వదలకుండా తన ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటికైనా ఒక హిట్ రావాలని మనందరం కోరుకుందాం…
.