గిఫ్ట్ ఏ స్మైల్ కింద విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్.

ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు.విద్యార్థుల చెంతకు వెళ్లి ట్యాబ్ లను అందజేసిన రాష్ట్ర ఐటీ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు.

 Minister Ktr Distributed Tabs To Students Under Gift A Smile.,rajanna Sirisilla,-TeluguStop.com

ఈ సందర్భంగా మంత్రి కే తారక రామారావు మాట్లాడుతూ మాట ఇచ్చిన మేరకు సిరిసిల్ల లో 1000 మందికి ట్యాబ్ లు పంపిణీ చేశామని,ఇప్పుడు మరో 2 వేల ట్యాబ్ లను అందజేస్తున్నాం అన్నారు.వేములవాడ నియోజకవర్గ విద్యార్థులకు 3 వేల ట్యాబ్ లను ఉచితంగా అందజేస్తామన్నారు.

ట్యాబ్ లను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు పోటీ పరీక్షలలో విజేతలు గా నిలిచి జిల్లా పేరు నిలబెట్టాలని విద్యార్థులకు తెలియజేశారు.

రూ.7 కోట్లతో ఎల్లారెడ్డిపేట హైస్కూల్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.ఎల్లారెడ్డి పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ను గంభీరావుపేట కేజీ టు పీజీ క్యాంపస్ మాదిరి అభివృద్ధి చేస్తామని,ఎల్లారెడ్డిపేట వేణు గోపాల స్వామి ఆలయంను రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు.కార్పొరేట్ పాటశాల కంటే ధీటుగా, మిన్నగా ప్రభుత్వ పాటశాల లను తీర్చిదిద్దేందుకు మన ఊరు మనబడి కార్యక్రమం ను సిఎం కేసిఆర్ చేపట్టారని తెలంగాణ రాష్ట్రం లోని 26 వేల పాఠశాలలను మన ఊరు మనబడి కార్యక్రమం లో మౌలిక సదుపాయాల తో సుందరంగా భాగంగా తీర్చి దిద్దుతాం అన్నారు.

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం పేద ప్రజలు, విద్యార్థుల మోముల్లో ఆనందం చూసేందుకు ఈ కార్యక్రమంను చేపట్టామని తెలిపారు.

అలాగే 86 వేల విలువైన ఆకాష్ బై జూస్ సాఫ్ట్వేర్ ట్యాబ్ లను విద్యార్థులకు అందజేస్తున్నాఓ అని తెలిపారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే అగ్రస్థానంలోనే నిలవడం మనందరికీ గర్వకారణమని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,ప్రజా ప్రతినిధులు, అధికారులకు, క్షేత్ర పారిశుద్ధ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, డి ఐ జి రమేష్ నాయుడు, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా విద్యాధికారి ఎ రమేష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube