మాట ఇచ్చిన మేరకు సిరిసిల్ల లో 1000 మందికి ట్యాబ్ లు పంపిణీ చేశాం.ఇప్పుడు మరో 2 వేల ట్యాబ్ లను అందజేస్తున్నాo.
వేములవాడ నియోజకవర్గ విద్యార్థులకు 3 వేల ట్యాబ్ లను ఉచితంగా అందజేస్తాం.ట్యాబ్ లను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు పోటీ పరీక్షలలో విజేతలు గా నిలిచి జిల్లా పేరు నిలబెట్టాలి రూ.7 కోట్లతో ఎల్లారెడ్డిపేట హైస్కూల్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాం.
ఎల్లారెడ్డి పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ను గంభీరావుపేట కేజీ టు పీజీ క్యాంపస్ మాదిరి అభివృద్ధి చేస్తాం.ఎల్లారెడ్డి పేట వేణు గోపాల స్వామి ఆలయంను రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తాం.కార్పొరేట్ పాటశాల కంటే ధీటుగా, మిన్నగా ప్రభుత్వ పాటశాల లను తీర్చిదిద్దేందుకు మన ఊరు మనబడి కార్యక్రమం ను సిఎం కేసిఆర్ చేపట్టారు.తెలంగాణ రాష్ట్రం లోని 26 వేల పాఠశాలలను మన ఊరు మనబడి కార్యక్రమం లో మౌలిక సదుపాయాల తో సుందరంగా భాగంగా తీర్చి దిద్దుతాం.గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం పేద ప్రజలు, విద్యార్థుల మోముల్లో ఆనందం చూసేందుకు చేపట్టాం.86 వేల విలువైన ఆకాష్ బై జూస్ సాఫ్ట్వేర్ ట్యాబ్ లను విద్యార్థులకు అందజేస్తున్నాం.స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే అగ్రస్థానంలోనే నిలవడం మనందరికీ గర్వకారణం.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ప్రజా ప్రతినిధులు, అధికారులకు, క్షేత్ర పారిశుద్ధ్య సిబ్బందికి అభినందనలు.
సమావేశంలో మంత్రి కే తారక రామారావు.
ఎల్లారెడ్డిపేట :మంచిగా చదువుకొని ఐఐటీ, నీట్ ఎంట్రెన్స్‌లతో పాటు ఇతర రంగాల్లో మంచి ర్యాంకులు సాధించండి.ప్రపoచంతో పోటీ పడే పౌరులుగా తయారు కావాలనే ఉద్దేశంతోనే మీకు ఈ ట్యాబ్‌లు అందజేస్తున్నామని సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.జిల్లా విద్యార్థిని, విద్యార్థులు రాష్ట్రంలో, దేశంలో అగ్రభాగాన ఉన్నారంటే మీ తల్లిదండ్రులు, అధ్యాపకులు,ప్రజాప్రతినిధులై నా తామంతా గర్వపడుతామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
రాబోయే మూడు నెలలు బాగా చదువుకొని ఐఐటీ, నీట్ ఎంట్రెన్స్‌లతో పాటు ఇతర రంగాల్లో మంచి ర్యాంకులు సాధించండి.ప్రపoచంతో పోటీ పడే పౌరులుగా తయారు కావాలనే ఉద్దేశంతోనే మీకు ఈ ట్యాబ్‌లు అందజేస్తున్నామని మంత్రి అన్నారు.
మంగళవారం గిఫ్ట్ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట పరిధిలో 2 వేల మంది ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ ట్యాబ్‌లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంకు రాష్ట్ర ఐటీ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ ట్యాబ్‌లను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కేటీఆర్ సూచించారు.
చదువుల కోసం వాడండి.ఇందులో ఇంటర్నెట్ పెట్టి ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ పెట్టి అడ్డమైన కార్యక్రమాలు చేయకండి.
అంటే వాటితో టైం వేస్ట్ చేయకండి.వేరే విషయం కాదు.
మంచిగా చదువుకొని ఐఐటీ, నీట్ ఎంట్రెన్స్‌లతో పాటు ఇతర రంగాల్లో మంచి ర్యాంకులు సాధించండి.ప్రపoచంతో పోటీ పడే పౌరులుగా తయారు కావాలనే ఉద్దేశంతోనే మీకు ఈ ట్యాబ్‌లు అందజేస్తున్నాం.
వేములవాడ నియోజకవర్గానికి కూడా తప్పకుండా 3 వేల ట్యాబ్‌లు అందిస్తాం.రాష్ట్ర, దేశ స్థాయిలో మంచి ర్యాంకులు సాధిస్తే తమకు తృప్తి కలుగుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.ఒక్కో ట్యాబ్ విలువ రూ.86 వేలు.గిఫ్ట్ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా చిన్నారి తమ్ముళ్లు, చెల్లెళ్ల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని ఆకాష్ బై జూస్ సాఫ్ట్‌వేర్ ట్యాబ్‌లను విద్యార్థులకు అందజేస్తున్నాo ట్యాబ్‌లను పంపిణీ చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు.ఈ ట్యాబ్‌ల ద్వారా పోటీ పరీక్షలకు ఉపయోగపడే మెటిరీయల్‌ను అందజేస్తున్నాం.బయట కంటే ఈ ట్యాబ్ విలువ రూ.10 వేలు అవుతుంది.మెటిరీయల్ విలువ రూ.75 వేలు అవుతుంది.అంటే ఒక్కో ట్యాబ్ విలువ రూ.86 వేలు.దీన్ని ఉచితంగా మీ చేతుల్లో పెడుతున్నాం.మీరు బాగా చదువుకుంటే.
మేమంతా సంతోషపడుతాం.గర్వపడతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కార్పొరేట్ పాఠశాలల కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలలు ఎల్లారెడ్డిపేట పాఠశాల రూ.7 కోట్లతో అద్భుతంగా తయారవుతోంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు.రాబోయే 2, 3 నెలల్లోనే ఆ పాఠశాలను ప్రారంభిచుకుందాం అని చెప్పారు.పాఠశాల గొప్పగా తయరవుతోంది.కానీ జూనియర్ కాలేజీ గ్రౌండ్ అనుకున్నట్టు లేదు.ఈ గ్రౌండ్‌ను మినీ స్టేడియంగా తీర్చిదిద్దుతాం అని స్పష్టం చేశారు.వేణుగోపాల స్వామి ఆలయాన్ని రూ.2 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం అని చెప్పారు.మొత్తం మన జిల్లాలోని పాఠశాలలను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.కార్పొరేట్ పాఠశాలల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దబోతున్నాం అని పేర్కొన్నారు.మన ఊరు మన బడి కార్యక్రమం కింద గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించుకున్నాం.రాబోయే రోజుల్లో 26 వేల ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దడంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందిస్తామన్నారు.
విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, డి ఐ జి రమేష్ నాయుడు, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా విద్యాధికారి ఎ రమేష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.