సాధారణంగా ఏదైనా ఒక సినిమా హిట్ అయితే దానికి ఇతర ఇండస్ట్రీల్లోకి డబ్ చేసి అయిన విడుదల చేస్తారు.లేదా ఇతర హీరోలతో రీమేక్ అయిన చేస్తారు.
కానీ ఫ్లాప్ సినిమాలను రీమేక్ చేసేందుకు గాని లేదా డబ్ చేసేందుకు గాని సినీ మేకర్స్ ముందుకు రారు.కానీ ఇప్పుడలా కాదు ఒక ఇండస్ట్రీలో ఫ్లాప్ గా మిగిలిన సినిమాలు కూడా ఇతర ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.
ఉదాహరణకు ప్రభాస్ నటించిన సాహో మూవీ తెలుగులో నిరాశపరిచినప్పటికి హిందీలో మాత్రం కోట్లు కొల్లగొట్టింది.అలాగే తెలుగులో యావరేజ్ హిట్ గా నిలిచిన కార్తికేయ 2 మూవీ హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు ఫ్లాప్ మూవీస్ కి హిందీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టిన సినిమాల సంఖ్య ఎక్కువే వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం !
1.ఆగడు
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తెలుగులో డిజాస్టర్ గా మిగిలింది.కానీ హిందీలో మాత్రం ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.ఎంకౌంటర్ శంకర్ పేరుతో హిందీలోకి డబ్ అయిన ఈ మూవీ టీవిల్లో ఎప్పుడు ప్రసారం అయిన టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.యూట్యూబ్ లో కూడా మిలియన్ల కొద్ది వ్యూస్ ను సంపాధించుకుంది.
2.లై
నితిన్ నటించిన ఈ మూవీ తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది.కానీ ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
యూట్యూబ్ ఈ మూవీ హిందీ డబ్బింగ్ వర్షన్ కు 175 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను సంపాదించుకుంది.దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ని హిందీ ఆడియన్స్ ఎంతలా ఆధారిస్తున్నారో అనే విషయం.
3.జైసింహా

నటసింహా నందమూరి బాలకృష నటించిన ఈ మూవీ తెలుగులో బిలో యావరేజ్ మూవీ గా నిలిచింది.కానీ హిందీ డబ్బింగ్ వర్షన్ మాత్రం అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది.యూట్యూబ్ లో ఈమూవీ ఇప్పటికే 150 మిలియన్స్ వ్యూస్ ను సంపాదించుకుంది.ఈ మూవీ ఇచ్చిన జోష్ తోనే బాలయ్య “అఖండ మూవీని కూడా హిందీలో డబ్ చేశారు.
4.సీత

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తెలుగులో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది కానీ హిందీ ఆడియన్స్ ను మాత్రం ఈ మూవీ ఫిదా చేసింది.యూట్యూబ్ లో ఈ మూవీ ఇప్పటివరకు 500 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకొని తెలుగు ఆడియన్స్ ను ఔరా అనిపించేలా చేసింది.
5.జయ జానకి నాయక

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా వచ్చిన ఈ మూవీకి కూడా హిందీలో కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.తెలుగులో యావరేజ్ హిట్ గా నిలిచిన ఈ మూవీ హిందీ డబ్బింగ్ వర్షన్ మాత్రం మిలియన్ల వ్యూస్ ను సంపాధించుకుంది.ఇప్పటివరకు ఈ మూవీ 700 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకొని.
హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ కు హిందీ మార్కెట్ క్రియేట్ చేసింది.ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సాక్షం, రామ్ పోతినేని నటించిన హలో గురు ప్రేమకోసమే వంటి ఫ్లాప్ సినిమాలు హిందీ డబ్బింగ్ వర్షన్స్ సూపర్ హిట్ గా నిలిచాయి.







