జో బైడెన్ కొలువులో మరో ఇద్దరు భారతీయులకు చోటు.. వైట్‌హౌస్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో ఇద్దరు భారతీయులకు తన కొలువులో చోటు కల్పించారు.ఎగుమతులకు సంబంధించిన ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్‌లో పునీత్ రెన్జన్, రాజేష్ సుబ్రహ్మణ్యంలను సలహాదారులుగా నియమించారు.

 Us President Joe Biden Appoints 2 Indian-origin Corporate Leaders To His Export-TeluguStop.com

వీరితో పాటు ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ సభ్యుల జాబితాను జో బైడెన్ మంగళవారం వైట్‌హౌస్‌కు పంపారు.ఈ మండలికి మార్క్ ఎడిన్ నేతృత్వం వహిస్తున్నారు.

కాసిల్ సిస్టమ్స్ ఛైర్మన్‌గా వుంటారు.కార్పోరేట్, లేబర్, రియల్ ఎస్టేట్, జాతీయ భద్రత, న్యాయం వంటి రంగాలకు చెందిన డజనుకు పైగా నాయకులు ఈ ప్రెసిడెంట్స్ ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్‌లో సభ్యులుగా వుంటారు.

Telugu Ceo Deloitte, Export Council, Lyle Brainard, Puneeth Renjan, Joe Biden, J

ఇదిలావుండగా.గతేడాది డిసెంబర్ 31న డెలాయిట్ గ్లోబల్ సీఈవోగా రెన్జన్ రిటైర్ అయ్యారు.2015 జూన్ నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు.ప్రస్తుతం పునీత్ .డెలాయిట్ గ్లోబల్ సీఈవో ఎమెరిటస్‌గా పనిచేస్తున్నారు.ఇక సుబ్రహ్మణ్యం విషయానికి వస్తే.

ఫెడెక్స్ కార్పోరేషన్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఈ హోదాలో ఆయన ఫెడెక్స్ ఆపరేటింగ్ కంపెనీలకు స్ట్రాటజీని పర్యవేక్షిస్తారు.

Telugu Ceo Deloitte, Export Council, Lyle Brainard, Puneeth Renjan, Joe Biden, J

ఇకపోతే.ఈ నెల ప్రారంభంలో జో బైడెన్ వైట్‌హౌస్‌లో తన జాతీయ ఆర్ధిక బృందాన్ని పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే.ఈ జాబితాలో భారత సంతతికి చెందిన భరత్ రామమూర్తికి మరోసారి అవకాశం కల్పించారు .లేల్ బ్రెయినార్డ్.నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారని, అలాగే జారెడ్ బెర్న్ స్టెయిన్.కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్ చైర్‌గా నామినేట్ అయినట్లు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.

భరత్ రామమూర్తి.నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా , స్ట్రాటజిక్ ఎకనామిక్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌గా కొనసాగుతారని శ్వేతసౌధం ప్రకటించింది.

అలాగే ప్రస్తుతం కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్‌లో మెంబర్‌గా పనిచేస్తున్న హీథర్ బౌషేకు కూడా మరోసారి అవకాశం కల్పించారు బైడెన్.ఆయన అమెరికా కేబినెట్‌లో చీఫ్ ఎకనామిస్ట్‌గానూ సేవలందించారు.

ప్రస్తుతం కార్మిక శాఖలో చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేస్తున్న జోయెల్ గాంబుల్‌ను కూడా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు బైడెన్ .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube