నిన్న తెనాలిలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ చాలా ఆవేశంగానే ప్రసంగించారు.టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి జగన్ సవాల్ విసిరారు.175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడికి ఉందా అంటూ జగన్ సవాల్ విసిరారు.ఈ సవాల్ పై తాజాగా బిజెపి నుంచి టిడిపిలో చేరిన సీనియర్ పొలిటిషన్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.
జగన్ వ్యాఖ్యలకు ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.పోలీసులతో పాలన చేయడమా జగన్ రెడ్డి దమ్ము ? ప్రతిపక్షాల నోరునొక్కడమేనా జగన్ రెడ్డి దమ్ము అంటూ కన్న ప్రశ్నించారు.టిడిపి ఏదైనా కార్యక్రమం చేపడితే. రాత్రికి వాళ్ళ ఆస్తులు తగులబెట్టడమా ధైర్యం అంటూ కన్నా విమర్శలు చేశారు.జగన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలలో డబ్బు , మద్యం పంచకుండా రావాలంటూ కన్నా సవాల్ విసిరారు.
” నీ నవరత్నాలపై నీకు నమ్మకం ఉంటే .సక్రమ పద్ధతిలో ఎన్నికలకు రా, సీఎంగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు చేసిన వ్యాఖ్యలు గుర్తుచేసుకో.కులం మతం చూడకుండా పాలన చేశానని ప్రజలను ఓట్లు అడిగే దమ్ము ఉందా.
ప్రజాసమస్యలు పక్కదారి పట్టించేందుకే విమర్శలు.సవాళ్లు ” అంటూ కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు.
నిన్న తెనాలి లో జరిగిన రైతు బరోసా నిధుల విడుదల సభలో మాట్లాడిన జగన్ తాము రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, ఇతర పార్టీలు కూడా ఒంటరిగా పోటీ చేయాల్సిందే అంటూ జగన్ మాట్లాడారు.ఈ సందర్భంగా టిడిపి జనసేనకు జగన్ సవాళ్లు విసిరారు .
దేవుడి దయ , ప్రజల చల్లని ఆశీస్సులపై నేను ఆధారపడ్డాను.అందుకే భయం లేకుండా 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని చెబుతున్న, 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు , ఆయన దత్త పుత్రుడికి ఉందా ? వాళ్లకు ధైర్యం లేదు ఎందుకంటే ప్రజలకు వాళ్ళు మంచి చేసిన దాఖలాలు లేవు.ప్రజలకు మేలు చేశానన్న నమ్మకం ధైర్యం ఉంది కాబట్టే అన్ని స్థానాల్లో గెలుస్తామని చెబుతున్నాను ” అంటూ జగన్ మాట్లాడారు.