తెలంగాణ ఐటీ మినిష్టర్ కేటీఆర్ కు ప్రజల్లో ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు.ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం కేటీఆర్ ను ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.
నిన్న బలగం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా ఈ ఈవెంట్ లో జరిగిన ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.హైదరాబాద్ లో ఈ ఈవెంట్ జరగగా మంత్రి కేటీఆర్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రముఖ కమెడియన్ వేణు ఈ సినిమాకు దర్శకుడు కాగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.స్టేజ్ పైకి జాతిరత్నాలు దర్శకుడు కేవీ అనుదీప్ ను యాంకర్ పిలవగా అదే సమయంలో డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ స్టేజ్ పైకి ఎంటర్ అయ్యారు.
అనుదీప్ మాట్లాడుతున్న సమయంలో యాంకర్ ఆపేసి సిద్ధు జొన్నలగడ్డకు స్వాగతం పలికారు.

ఇది గమనించిన కేటీఆర్ వెంటనే కంటిచూపుతో అనుదీప్ కు మైక్ ఇవ్వాలని అర్థం వచ్చే విధంగా సైగలు చేశారు.ఆ సమయంలో యాంకర్ ఫేస్ ఒక్కసారిగా మారిపోగా యాంకర్ అనుదీప్ కు మైక్ ఇచ్చేసి వెళ్లిపోయారు.ఈ నెల 3వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.
ఈ సినిమా కచ్చితంగా అంచనాలను మించి మెప్పిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బలగం సినిమా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కగా భారీ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది.బలగం మూవీకి పరవాలేదనే స్థాయిలో బుకింగ్స్ జరుగుతుండగా ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే వేణు దర్శకుడిగా బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.







