ఆ యూజర్లకు వాట్సాప్ శుభవార్త... ఫోటోను స్టిక్కర్‌గా మార్చేయచ్చు!

WABetaInfo తాజా సమాచారం ప్రకారం వాట్సాప్‌ చాలా సైలెంట్ గా iOS వెర్షన్ యాప్‌కి కొత్త ఫీచర్‌ను జోడించబోతున్నట్టు తెలుస్తోంది.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వినియోగదారులు తమ గ్యాలరీ ఫోటోలను ఎటువంటి థర్డ్‌ పార్టీ యాప్ అవసరం లేకుండానే వాట్సాప్‌ స్టిక్కర్‌లుగా మార్చడానికి ఉపయోగపడుతుందని భోగట్టా.

 Whatsapp Ios Users Can Now Directly Make Custom Stickers From Photos Details, Wh-TeluguStop.com

వాట్సాప్‌ నేడు పెద్ద సంఖ్యలో యూజర్లను సొంతం చేసుకొనే పనిలో పడింది.దానికోసం ప్రతి రోజు ప్రత్యేక ఫీచర్లతో వినియోగదారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

వాట్సాప్ మొట్టమొదటగా 2018లో స్టిక్కర్ సపోర్ట్‌ను ఇంట్రడ్యూస్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే.అయితే ఇంతకు ముందు వరకూ వినియోగదారులను కస్టమైజ్‌ స్టిక్కర్ ప్యాక్‌లను క్రియేట్‌ చేయడానికి అనేక థర్డ్-పార్టీ యాప్‌లపై ఆధారపడవలసి ఉండేది.కాగా ఆ ఆప్షన్‌ను ఇప్పుడు నేరుగా వాట్సాప్‌ అందించనుంది.కాగా ఈ ఫీచర్ వాట్సాప్‌ ఐఫోన్‌ వెర్షన్ 23.3.77తో అందుబాటులో ఉంది.ఇప్పుడు వినియోగదారులు యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఐఫోన్ ఆల్బమ్ నుంచి ఫోటోను సెలక్ట్‌ చేసుకుని, వాట్సాప్ స్టిక్కర్‌గా మార్చుకోవచ్చు.

ఇకపోతే iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే iPHONEలలో మాత్రమే ఈ ఫీచర్ పని చేయనుంది.పాత iOS వెర్షన్‌లు ఈ ఫీచర్‌ని సపోర్ట్‌ చేయవని వినియోగదారులు గుర్తు పెట్టుకోవాలి.ఇక ఈ ప్రాసెస్ కోసం ఇలా ఫాలో చేయండి.ముందుగా ఐఫోన్‌లో ఫోటోస్‌ యాప్‌ని ఓపెన్‌ చేసి, ఇమేజ్‌ను సెలక్ట్‌ చేసుకుని ఇమేజ్‌ నుంచి సబ్జెక్ట్‌ను వేరు చేయడానికి ఫోటోపై ట్యాప్‌ చేసి హోల్డ్‌ చేసి అలా ఉంచండి.

ఇప్పుడు ఏదైనా వాట్సాప్‌ కన్వర్జేషన్‌లోకి సబ్జెక్ట్‌ని డ్రాగ్‌ చేసి డ్రాప్‌ చేసి సదరు ఇమేజ్‌ను స్టిక్కర్‌గా క్రియేట్‌ చేసిన తర్వాత, అది వాట్సాప్‌ స్టిక్కర్‌ కలెక్షన్‌లో సేవ్ అయి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube