బుస్టింగా.. వార్నింగా ? వాట్ అమిత్ షా జీ ?

తెలంగాణలో ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంది.ప్రస్తుతం పార్టీ కూడా రాష్ట్రంలో బలం పెంచుకుంది.

 Amit Shah's Warning To Ts Bjp Leaders, Amit Shah , J.p. Nadda , Etela Rajender-TeluguStop.com

దీంతో ఈసారి అధికారం పక్కా అని కమలనాథులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఎందుకంటే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ విజయాన్ని సొంతం చేసుకోవడం.

అలాగే గ్రేటర్ ఎన్నికల్లో కూడా అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాల్లో గెలవడం.ఇక మునుగోడు ఉపఎన్నికల్లో కూడా గెలుపుకు కొద్ది దూరంలో ఆగిపోవడం, ఈ పరినమలన్నీ కూడా బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని చెప్పకనే చెబుతున్నాయని కమలనాథులు పదే పదే చెబుతున్నారు.

అందుకే ఈసారి ఎన్నికల్లో విజయం బీజేపీదే అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.అయితే ఈ కాన్ఫిడెన్స్ అంతా కూడా పైపైనే అనే మాట కూడా వినిపిస్తోంది.

బీజేపీ నేతలు ఊహిస్తున్నంత బలం రాష్ట్రం బీజేపీకి లేదనేది కొందరి వాదన ఎందుకంటే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు పార్టీ ప్రభావం కాదని, ఆ విజయాలు పోటీలో నిలిచిన అభ్యర్థులవని కొందరి అభిప్రాయం.ఇందులో నిజం కూడా లేకపోలేదు.

దుబ్బాకలో బీజేపీ తరుపున నిలిచిన రఘునందన్ రావు, మరియు హుజూరాబాద్ లో పోటీలో నిలిచిన ఈటెల రాజేందర్ లకు ఆయా నియోజిక వర్గాల్లో మంచి పట్టు ఉంది.వారి వల్లే బీజేపీకి గెలుపు సాధ్యమైందనేది కొందరి వాదన.

ఇక గెలుపు మాదే అని కాషాయ నేతలు చేస్తున్న హైరానా కూడా తాటాకు చప్పుల్లేనట.

Telugu Amit Shah, Bandi Sanjay, Bjp, Delhi, Etela Rajender, Nadda-Politics

ఎందుకంటే క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ నేతలు చేపడుతున్న ఏ కార్యక్రమాలపై కూడా ప్రజల నుంచి పెద్దగా మద్దతు రావడం లేదనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామయాత్ర కు కూడా అనుకున్న స్థాయిలో ఆధారణ లభించడం లేదట.మరోవైపు బీజేపీ నేతలు కూడా యాక్టివ్ గా లేకపోవడంతో అధిష్టానం టి‌ఎస్ నేతలపై కాస్త గుర్రుగానే ఉందట.

ఎందుకంటే ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీని చూస్తున్న సమయంలో నేతల నిర్లక్ష్యం వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందనే భావనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే ఉన్నపళంగా టి‌ఎస్ బీజేపీ నేతలకు డిల్లీ నుంచి పిలుపు వచ్చింది.

Telugu Amit Shah, Bandi Sanjay, Bjp, Delhi, Etela Rajender, Nadda-Politics

అమిత్ షా తో నడ్డా ఇంట్లో టి‌ఎస్ బీజేపీ నేతలు బేటీ అయ్యారు.ఈ బేటీలో అమిత్ షా టి‌ఎస్ బీజేపీ నేతలకు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, ప్రతి ఇంటికి పార్టీని తీసుకెళ్లాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది.అంతే కాకుండా పార్టీలోని లోటుపట్లను కూడా అమిత్ షా ముందుంచరట తెలంగాణ కమలనాథులు.

ఇకనైనా పార్టీని బలోపేతం చేయడంలో నిర్లక్ష్యం చూపరాదని అమిత్ షా సూచించినట్లు సమాచారం.పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు అన్నీ విధాలుగా అండగా ఉంటామని, కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని అమిత్ షా కాస్త గట్టిగానే చెప్పారట.

మొత్తానికి టి‌ఎస్ కమలనాథులకు అమిత్ షా వార్నింగ్ తో పాటు బుస్టింగ్ కూడా ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube