సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.ఇలా మొదటి సినిమాతోనే ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె తరువాత నాని హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నారు.
అలాగే రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోయే సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నా కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో నటించిన మృణాల్ ఎంతోమంది అబ్బాయిలకు కలల రాణిగా మారిపోయారు.ఇలా ఎంతోమంది ఈమెకు అభిమానులుగా మారిపోవడంతో ఏకంగా ఈమెను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రపోజల్స్ కూడా పెట్టేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక అభిమాని ఏకంగా ఈమెను నన్ను పెళ్లి చేసుకుంటావా నా సైడ్ నుంచి సంబంధం ఓకే అయింది మరి నీ సైడ్ నుంచి పెళ్లికి ఓకేనా అంటూ ఈమెను పెళ్లి గురించి ప్రశ్నిస్తూ తనకు ప్రపోజ్ చేశారు.

ఇలా అభిమాని తనకు ప్రపోజ్ చేయడంతో స్పందించిన మృణాల్ చాలా సున్నితంగా సమాధానం చెప్పారు.నా తరపు నుంచి వద్దు అనుకుంటున్నాను అంటూ ఈమె కామెంట్ చేశారు.ఇలా సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈమె చాలా సున్నితంగా సమాధానం చెప్పడంతో కొందరు ఈ కామెంట్ పై స్పందిస్తూ కామన్ మ్యాన్ కి దక్కే మహారాణి కాదు ఆమె అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా ఈమె పలు యాడ్స్ బాలీవుడ్ సినిమాలలో నటించినప్పటికీ రాని గుర్తింపు తెలుగులో నటించిన సీతారామం సినిమా ద్వారా ఒక్కసారిగా ఎంతో పాపులర్ అయ్యారు.







