ప్రస్తుత మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న కంపెనీలలో బౌల్డ్ ఆడియో కంపెనీ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.మార్కెట్లో ఈ కంపెనీ ఆడియో ప్రొడక్ట్స్ తో పాటు, స్మార్ట్ వాచెస్ కి కూడా డిమాండ్ ఉంది.
మార్కెట్లోని వినియోగదారుల అవసరాలను బట్టి ఈ కంపెనీ కొత్త కొత్త మోడల్స్ ను విడుదల చేస్తూనే ఉంది.ఇంకా మధ్యతరగతి వాళ్లను దృష్టిలో ఉంచుకొని తక్కువ బడ్జెట్ లోనే మంచి క్వాలిటీ వస్తువులను మార్కెట్లోకి తీసుకు వస్తున్నారు.

తాజాగా బౌల్డ్ ఆడియో కంపెనీ ఓ స్మార్ట్ వాచ్ ని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.పైగా భారత మార్కెట్లో బౌల్డ్ ఆడియో కంపెనీకి మంచి పేరుతో పాటు డిమాండ్ ఉంది.ఈ కంపెనీ ప్రతి ఏడు సెకండ్లకు ఒక యూనిట్ విక్రయిస్తూ, కోటికి పైగా యూనిట్స్ అమ్మకాలు జరిపింది.స్ట్రైకర్ పేరు మీద ఓ స్మార్ట్ వాచ్ నీ భారత మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ వాచ్ ఎంఆర్పీ ధర రూ.7,999.అయితే లాంచింగ్ ఆఫర్లు ప్రకటించింది కంపెనీ.ఈ ఆఫర్ కింద కేవలం రూ.1,499 లకే వినియోగదారులు పొందవచ్చు.

ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందో కంపెనీ ప్రకటించలేదు.ఈ వాచ్ స్టైలిష్ గా ఉండి, రౌండ్ అనలాగ్ డిజైన్ తో మూడు కలర్ వేరియంట్లతో విడుదల అయింది.ఈ స్మార్ట్ వాచ్ 1.3 ఇంచెస్ రౌండ్ హెచ్ డి డిస్ప్లే, బ్లూ టూత్ కాలింగ్, వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్, 150 కి పైగా వాచ్ ఫేసెస్, నాన్ స్టాప్ హెల్త్ మోనిటర్, ఐపి 67 వాటర్ రెసిస్టెన్స్, 20 రోజుల బ్యాటరీ స్టాండ్ బై, వన్ వీక్ బ్యాటరీ బ్యాకప్ లాంటి ఫీచర్లతో బౌల్డ్ వెబ్సైట్ తో పాటు ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది.72 గంటల రీప్లేస్మెంట్ పాలసీ ఉంది.ఇక ఒక ఏడాది పాటు స్మార్ట్ వాచ్ పై వారెంట్ కూడా ఉంటుంది.







