టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్లు ఉన్నారు.ఈ హీరోయిన్లకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.
అయితే కొంతమంది హీరోయిన్లు పలు బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేసి కెరీర్ పరంగా తప్పు చేశారు.గీతా గోవిందం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఈ సినిమాను రాశీఖన్నా రిజెక్ట్ చేయగా రష్మిక ఆ పాత్రలో నటించి సక్సెస్ సాధించారు.ఎఫ్2 సినిమాను కూడా రాశీఖన్నా రిజెక్ట్ చేయగా ఆ పాత్రలో తమన్నా నటించి సక్సెస్ ను అందుకున్నారు.

రంగస్థలం సినిమాలో మొదట అనుపమకు ఛాన్స్ రాగా ఆ సినిమాలో చివరి నిమిషంలో అనుపమకు బదులుగా సమంత ఎంపికయ్యారు.బాహుబలి మూవీలో తమన్నా పాత్రకు మొదట సోనమ్ కపూర్ పేరును పరిశీలించారు.అయితే సోనమ్ రిజెక్ట్ చేయడంతో ఆ ఛాన్స్ తమన్నాకు దక్కింది.
బిజినెస్ మేన్, జెర్సీ సినిమాలలో ఛాన్స్ రాగా శృతి హాసన్ ఆ క్రేజీ ఆఫర్లను వదులుకోవడం గమనార్హం.

అర్జున్ రెడ్డిలో హీరోయిన్ కోసం పార్వతీ నాయర్ ను పరిశీలించగా ఆమె రిజెక్ట్ చేయడంతో షాలినీ పాండే ఈ సినిమాలో ఎంపికయ్యారు.కుమారి 21ఎఫ్ సినిమాలో హీరోయిన్ గా మొదట చాందిని చౌదరి ఎంపికయ్యారు.అయితే రోల్ బోల్డ్ గా ఉండటంతో ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేయగా హెబ్బా పటేల్ ఈ మూవీలో హీరోయిన్ గా ఎంపికయ్యారు.
కొంతమంది హీరోయిన్లు కథలు నచ్చినా డేట్లు కేటాయించలేక ఈ సినిమాలను వదులుకున్నారు.

ఈ సినిమాలలో నటించి ఉంటే ఈ హీరోయిన్ల సినీ కెరీర్ మాత్రం మరో రేంజ్ లో ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.స్టార్ హీరోయిన్లు మంచి కథలను రిజెక్ట్ చేస్తే కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.







