టాలీవుడ్ సీనియర్ నటీమణులలో ఒకరైన రాజశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా నటించిన ఈ నటి తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నారు.
తెలుగుతో పాటు ఇతర భాషల్లోని సినిమాలలో సైతం ఆమె నటించారు.ఒక ఇంటర్య్వూలో రాజశ్రీ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు మరి కొందరు స్టార్ హీరోలకు జోడీగా రాజశ్రీ నటించారు.జానపద చిత్రాలలో రాజశ్రీ ఎక్కువగా నటించగా ఆ సినిమాలు ఎక్కువగా సక్సెస్ సాధించాయి.
భర్త చనిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు.హీరోయిన్ గా ఫుల్ గా బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నానని నాకు చెప్పకుండా పెళ్లిచూపులు అరేంజ్ చేశారని రాజశ్రీ అన్నారు.

నాకు చెప్పకుండా పెళ్లిచూపులు ఏర్పాటు చేసి పెళ్లి చేశారని ఆమె వెల్లడించారు.పెళ్లి తర్వాత సినిమాలపై ఆసక్తి చూపలేదని అందరూ నేను లక్కీ అని తంతే బూరెల బుట్టలో పడ్డానని అనుకున్నారని రాజశ్రీ వెల్లడించారు.మా అత్తగారిది ఉన్నతమైన కుటుంబం అని కొంతకాలానికి భర్త చనిపోవడంతో నా జీవితం తలక్రిందులు అయిందని రాజశ్రీ కామెంట్లు చేశారు.

నా కొడుకుకు మూడేళ్ల వయస్సు ఉన్న సమయంలో భర్త గుండెపోటుతో చనిపోయారని రాజశ్రీ పేర్కొన్నారు.ఆ డిప్రెషన్ వల్ల పదేళ్ల పాటు బయటకు రాలేదని బయటి ప్రపంచానికి ముఖం చూపించకుండా బ్రతికానని ఆమె చెప్పుకొచ్చారు.ప్రస్తుతం నా కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడని రాజశ్రీ తెలిపారు.
రాజశ్రీ కెరీర్ పరంగా బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.ఈతరం ప్రేక్షకులలో కూడా రాజశ్రీకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
ప్రస్తుతం రాజశ్రీ వయస్సు 78 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.







