సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది.ఇలా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, మెదడు సమస్యలు తలెత్తుతున్నాయి.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలను ప్రభావితం చేసే తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారిపోయింది.ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రధానా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
కొలెస్ట్రాల్ నియంత్రించడంలో సహాయపడడానికి వివిధ మందులు అందుబాటులో ఉన్నప్పటికీ ఆహార మార్పులు చేసుకోవడం కూడా ఎంతో మంచిది.కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి వైద్యులు సిఫారసు చేసిన కొన్ని ఆహార పదార్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ఫైబర్ అద్భుతమైన మూలం.ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ప్రతిరోజు కనీసం ఒకటిన్నర కప్పుల వండిన ఓట్స్ రాత్రిపూట తినాలని చెబుతున్నారు.

అంతే కాకుండా చిక్కుళ్ళు, పప్పు ధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా శరీరంలోనీ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు.వారానికి కనీసం రెండు, మూడు సార్లు పప్పు ధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.అంతే కాకుండా సాల్మన్, సార్డినెస్ చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

చేపలను వారానికి కనీసం రెండుసార్లు తినమని వైద్యులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే బాదం, జీడిపప్పు వంటి గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఇలాంటి ఎన్నో పోషకాలను కలిగి ఉండడం వల్ల ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.ఈ ఆహార పదార్థాలను రోజువారి డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.







