ఏపీలో రోజురోజుకూ పోలిటికల్ హిట్ పెరుగుతోంది.మూడు ప్రధాన పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం పోటీ పడుతున్నాయి.దాంతో ఇప్పటినుంచే ఏపీలో ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది.2019 ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని విజయం సొంతం చేసుకొని వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలపై కన్నేసిన వైఎస్ జగన్ ఒకవైపు, అలాగే ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టి రాజకియాలకు స్వస్తి పలకాలని చూస్తున్న చంద్రబాబు మరోవైపు, ఇంకా ఒక్కఛాన్స్ అంటూ మొదటిసారి అధికారం కోసం గట్టిగా పరితపిస్తున్న పవన్ ఇంకోవైపు.ఇలా మూడు పార్టీల అధినేతలు వెస్తోన్న ప్రణాళికలు ఎన్నికల సంగ్రామాన్ని తలపిస్తున్నాయి.
అయితే వ్యూహరచన విషయంలో మూడు పార్టీల అధినేతలు వల్లిస్తోన్న మంత్రం సెంటిమెంట్.
గత ఎన్నికల్లో సెంటిమెంట్ అస్త్రం వైఎస్ జగన్ కు బాగా ఉపయోగపడిందనే చెప్పాలి.చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ ” మీ బిడ్డకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.
మన ప్రభుత్వాన్ని స్తాపించుకుందాం ” అంటూ జగన్ అల్లిన సెంటిమెంట్ ప్రజల్లో చాలానే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.ఎంతలా అంటే ఏపీ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో వైసీపీ తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు ఏపీ ప్రజలు.దాంతో ఈసారి కూడా సెంటిమెంట్ అస్త్రాన్ని మరోసారి సిద్దం చేసుకుంటున్నారు వైఎస్ జగన్.” మీ బిడ్డను దీవించండి.మంచి జరిగిందని ఆలోచించండి.మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు, ప్రత్యర్థులంతా ఒకవైపు అంటూ.“

అంటూ ప్రజల్లో సెంటిమెంట్ పండిస్తున్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డి.ఇక సెంటిమెంట్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో గత ఎన్నికల్లో జగన్ విజయాన్ని గమనించిన చంద్రబాబు.ఈసారి తాను కూడా సెంటిమెంట్ అస్త్రాన్నే నమ్ముకున్నారు.” ఈ ఒక్కసారి చివరి ఛాన్స్.” అంటూ బాబు సెంటిమెంట్ పండిస్తున్నారు.ఇక మరోవైపు పవన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు ” ఒక్క ఛాన్స్.
ఒకే ఒక్కచాన్స్ , నా కోసం కాదు.మీ కోసమే అధికారం ” అంటూ పవన్ తనదైన రీతిలో సెంటిమెంట్ రాజేస్తున్నారు.

ఇలా మూడు పార్టీల అధినేతలు అనుసరిస్తున్న సెంటిమెంట్ వ్యూహం ఎవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలియదు గాని, ఏపీ ప్రజలు మాత్రం ఎవరిని నమ్మాలి అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారనేది కొందరి అభిప్రాయం.అయితే కేవలం సెంటిమెంట్ ఒక్కటే విజయ తీరాలకు చేరుస్తుందా అంటే పప్పులో కాలేసినట్లే ఎందుకంటే ప్రజాభిప్రాయం ఎప్పుడెలా ఉంటుందో చెప్పడం కష్టం.గతంలో ఇది చాలాసార్లు నిరూపితం అయింది.ప్రజలు ఒక పార్టీకి అధికారం కట్టబెట్టడానికి చాలా ఫ్యాక్టర్స్ పైనా డీపెండ్ అయి ఉంటాయి.మరి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజాకర్షణ కోసం అధినేతలు ఇంకెలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి.







