20 పుస్తకాల పేర్లు చెప్పగలవా పవన్.. వర్మ సంచలన వ్యాఖ్యలు వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండగా మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు.పవన్ కు పుస్తకాలు అంటే ఎంతో ఇష్టం అనే సంగతి తెలిసిందే.

 Rgv Sensational Comments On Pawan Kalyan Goes Viral In Social Media Details, Paw-TeluguStop.com

పవన్ తన రియల్ లైఫ్ లో ఎన్నో వేల పుస్తకాలను చదివారు.పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తన పుస్తకాలలో చదివిన విషయాల గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

అయితే ఆర్జీవీ పవన్ గురించి తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు.20 పుస్తకాల పేర్లు చెప్పగలవా అంటూ వర్మ ఛాలెంజ్ విసరగా ఈ ఛాలెంజ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివానని చెబుతారని ఆ 2 లక్షల పుస్తకాల పేర్లు చెప్పాల్సిన అవసరం లేదని 20 పుస్తకాల పేర్లు చెబితే చాలని వర్మ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Telugu Cheguevara, Ram Gopal Varma, Janasena, Pawan Kalyan, Rgv-Movie

పవన్ నిమిషానికి ఒక రకంగా మాట్లాడతారని రాజకీయంగా పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటో స్పష్టత లేదని వర్మ పేర్కొన్నారు.పవన్ ఎప్పుడూ చేగువేరా గురించి మాట్లాడతారని చేగువేరా కమ్యూనిస్ట్ అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.చేగువేరను చిన్న వయస్సులో చంపేశారని ఆయన అక్కడ చేసిందేం లేదని ఆర్జీవీ వెల్లడించడం గమనార్హం.పవన్ 18 సంవత్సరాల వయస్సులో చేగువేరాకు ఫ్యాన్ అయ్యాడని ఆ సమయానికి పవన్ కు చేగువేరా గురించి ఏం తెలియదని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

Telugu Cheguevara, Ram Gopal Varma, Janasena, Pawan Kalyan, Rgv-Movie

ఇక్కడి మావోయిస్ట్ నేతల గురించి పవన్ మాట్లాడాలని ఆర్జీవీ కామెంట్లు చేశారు.పవన్ కు ఈ విషయాలు తెలుసో తెలియదో అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చారు.ఆర్జీవీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆర్జీవీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube