భారతీయులు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా బతికేస్తారు అని ఒక నానుడి.నిజమే, మన భారతీయులు లేని దేశం ఉంటుంది అంటే అనుమానమే! భారత్ నుంచి కొన్ని లక్షలమంది ఉపాధి కోసం ఇతర దేశాలు వెళ్తుంటారు.
ఈ క్రమంలో కొంత మంది పరాయి దేశాన్నే సొంత దేశం మాదిరి ఫీల్ అయ్యి అక్కడే సెటిల్ అయిపోతూ వుంటారు.కాగా మరికొందురు వస్తూ, పోతూ వుంటారు.
కొన్ని సర్వేలు ఏం చెబుతున్నాయి అంటే, భారత్ నుంచి ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్తుంటారు అని.
అవును, ముఖ్యంగా కేరళ, తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్తూ, వస్తూ వుంటారు.ఇక చాలా మంది ముఖ్యంగా రంజాన్ పండగ సందర్భంగా ఇండియాకు వస్తుంటారు.ఈ రంజాన్ మాసంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎక్కువ సెలవులు ఇస్తారు.
దీంతో చాలా మంది భారతీయులు ఇండియాకు రావడం పక్కా.ముఖ్యంగా ఈ రంజాన్ ముస్లింలకు చాలా పెద్ద పండుగ కాబట్టి వారు తప్పని సారిగా ఇండియాకు రావలసిందే.
ఇలా వచ్చే వారికి ఈసారి ఖర్చు కాస్త ఎక్కువగా కానుంది.
ఎందుకంటే? UAE నుంచి భారత్ కు వచ్చే విమాన ఛార్జీలు పెరిగే అవకాశం మెండుగా ఉంది.మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసం నుంచి విమాన ఛార్జీలు 10 నుంచి 25 శాతం వరకు పెరుగుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇక పండుగ దగ్గర పడేకొద్ది మరింత ఛార్జీలు పెరిగే అవకాశం ఎలాగూ ఉంటుంది.
కాగా గత 2 సంవత్సరాలుగా కొవిడ్ తో నెమ్మదించిన విమాన ప్రయాణాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.ఇక గల్ఫ్ న్యూస్ నివేదిక ప్రకారం, మార్చి 21 నుండి 30 వరకు, UAE నుండి భారతదేశానికి ఒక రౌండ్-ట్రిప్ ఎకానమీ టిక్కెట్ల ధర సుమారు 1,316 దిర్హామ్‌లు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.29,710 ఉండే అవకాశం ఉంది.