నేటి దైనందిత జీవితంలో ఎలాంటి వారన్నా సంవత్సరానికి ఒక్కసారైనా రిలాక్స్ అవ్వడానికి బయటకి ఓ రెండు మూడు వారాల పాటు టూర్ కి వెళ్లాలని అనుకుంటూ వుంటారు.కాస్త డబ్బులు ఎక్కువ వున్నవారు దేశాలను చుట్టి రావాలని అనుకుంటే, మిడిల్ క్లాస్ వారు దేశంలోనే పలు ప్రాంతాలకు వెళ్తూ వుంటారు.
ఈ క్రమంలో వారిదగ్గర వున్న డబ్బులను బట్టి ప్లాన్స్ చేసుకుంటూ వుంటారు.ఎందుకంటే అలా బయటకి వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది.
మరీ ముఖ్యంగా ఫ్యామిలీలతోనో లేదా స్నేహితులతోనో బృందంగా వెళ్లాలంటే భారీగా కావలసి ఉంటుంది.
అయితే మీరు పనిలో పనిగా తైవాన్ వెళ్లి రావాలంటే పెద్దగా భయపడవలసిన అవసరం లేదు.ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ టూరిస్ట్ స్పాట్ లలో తైవాన్ ఒకటి అని మీకు తెలిసినదే.కరోనాకు ముందు ప్రపంచలో ఎక్కువ మంది సందర్శించే నగరాల లిస్టులో ఇది కూడా ఒకటి.
అయితే కరోనా సంక్షోభం కారణంగా టూరిజమ్ మీద ఆధారపడిన అనేక దేశాలు ఇబ్బందులు పడగా ఈ లిస్టులో తైవాన్ కూడా వుంది.దీంతో తైవాన్ ప్రభుత్వం ఓ మహత్తరమైన ప్రణాళిక చేసింది.
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది.
అవును, తామే పర్యాటకుల ఖర్చులకు డబ్బులిస్తామని, అయితే దానికి చేయవలసిందల్లా అక్కడికి వెల్లడమేనని ప్రకటించింది.కరోనాకు పూర్వ ఉన్న స్థితికి తమ పర్యాటక వ్యవస్థను తీసుకెళ్లేందుకు తైవాన్ ప్రభుత్వం ప్రస్తుతం అక్కడ ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొచ్చింది.అందుకోసం ప్రపంచ పర్యాటకులకు అలోవెన్స్ ప్రకటించింది.
అయితే ఇచ్చిన అలవెన్సులపై తైవాన్ ప్రభుత్వం కొన్ని షరతులు కూడా విధించిందని ఆ దేశ రవాణా శాఖ మంత్రి వాంగ్ క్వాత్సాయ్ తాజాగా తెలిపారు.ఈ డబ్బును పర్యాటకులకు డిజిటల్ రూపేణా ఇస్తామని, వాటిని విహారయాత్రలో వారి ఖర్చులకు మాత్రమే వినియోగించగలుగుతారని పేర్కొన్నారు.