సూర్యాపేట జిల్లా:మహిళలపై కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు,మనువాద దాడికి వ్యతిరేకంగా పోరాడాలని పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక పిలుపునిచ్చారు.సోమవారం జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్ లో మార్చి ఎనిమిదిన జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కరపత్రాలను ఆవిష్కరించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆశాస్త్రియ, అమానవీయ విధానాలకు, అప్రజాస్వామిక ధోరణులకు వ్యతిరేకంగా గళం విప్పిన గోవింద్ పన్సరే,దబొల్కర్,కల్బర్గి, గౌరీ లంకేశ్ లాంటి ప్రజాస్వామిక వాదులను అర్ఎస్ఎస్ గుండాలు హత్య చేశారన్నారు.రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కు నిన్న ప్రీతి,ఈ రోజు రక్షిత లాంటి ఎంతో మంది మహిళలు గురౌతున్నారని,ప్రభుత్వం ర్యాగింగ్ నిరోధక చట్టం అమలు చేయడం లేదన్నారు.
తక్షణమే మెడికో విద్యార్ధి ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ చేసి, కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.విద్యాసంస్థలలో ర్యాగింగ్ నిరోధక చర్యల ప్రభుత్వం చేపట్టాలన్నారు.
మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంను గ్రామ గ్రామాన జరపాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చంద్రకళ, కోశాధికారి జయమ్మ,పద్మ, శైలజ,సుధ తదితరులు పాల్గొన్నారు.