స్టార్ హీరోయిన్ సమంత ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది. ఏ మాయ చేశావె సినిమా నుంచి యశోద సినిమా వరకు సినిమా సినిమాకు ఎంతో కష్టపడి నటిగా సమంత ఎదిగారు.
తాజాగా ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ సమంత ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.నేను ఎంత ఎదిగినా ఎంత దూరం ప్రయాణించినా మీరు చూపించే ప్రేమాభిమానాలను మరిచిపోలేనని సమంత అన్నారు.
నాపై ఈ స్థాయిలో అభిమానం చూపుతున్న ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు అని సమంత కామెంట్లు చేశారు.అదే విధంగా కొత్త విషయాలను పరిచయం చేస్తున్న ప్రతిరోజుకూ కృతజ్ఞతలు అని ఆమె చెప్పుకొచ్చారు.
గతంలో ఎన్నో విషయాలు తనను బాధించేవని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.కానీ ఇకపై కాదని సమంత పేర్కొన్నారు.కేవలం ప్రేమ, కృతజ్ఞతతో కొనసాగుతున్నానని సమంత కామెంట్లు చేయడం గమనార్హం.
ఏ మాయ చేశావె సినిమాలో జెస్సీ పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సమంత చైతన్యను వివాహం చేసుకుని వేర్వేరు కారణాల వల్ల విడిపోయారు.మయోసైటిస్ కారణంగా బాధ పడుతున్న సమంత ఆ వ్యాధి నుంచి కోలుకోగా పూర్తిస్థాయిలో సమంత కోలుకోవాలంటే మాత్రం చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.ప్రస్తుతం సమంత ఖుషి సినిమాతో పాటు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
ఈ రెండు సక్సెస్ సాధిస్తే సామ్ పారితోషికం అంతకంతకూ పెరిగే అవకాశం ఉంది.సమంత ప్రస్తుతం ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఛార్జ్ చేస్తున్నారు.సమంత సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటంతో దర్శకనిర్మాతలు ఆమెకు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు.సినిమా సినిమాకు సమంతకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.