ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలను షేర్ చేసి ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా? ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ప్రముఖ హీరోయిన్ అంటూ ఇలా క్యాప్షన్ లో జోడించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.సెలబ్రిటీలు సైతం వారి చిన్ననాటి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఈ మధ్యకాలంలో ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది.
ఆ ఫోటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదు సీనియర్ నటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ. కెరియర్ మొదట్లో గ్రామర్ పాత్రలో హీరోయిన్గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న రమ్యకృష్ణ ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ను ఏర్పరచుకుంది.
స్టార్ హీరోలందరి సరసన నటించి అందరి చేత ప్రశంసలు అందుకుంది.గ్లామరస్ పాత్రలు, లేడి ఓరియంటెడ్ సినిమాలు అలాగే అమ్మోరు తల్లి పాత్రల్లో ఇలా ఎటువంటి పాత్రలో నటించిన ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగల నటి రమ్యకృష్ణ.

ఇకపోతే ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రమ్యకృష్ణ ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా బాహుబలి సినిమాలో ప్రభాస్ తల్లి క్యారెక్టర్ లో శివగామిని గా నటించిన విషయం తెలిసిందే.బాహుబలి సినిమాతో భారీ క్రేజీని ఏర్పరచుకుంది రమ్యకృష్ణ.ఈమె ఆ తరం ప్రేక్షకులకు ఈ తరం ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.అలాగే గత ఏడాది రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

ప్రస్తుతం రమ్యకృష్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లితెరపై ప్రచారం అయ్యే పలుషోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ రమ్యకృష్ణ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.మొదట 1983లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ అప్పటినుంచి ఇప్పటివరకు అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.
ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఉంటుంది.







