కేంద్రం 2023 బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్ల కోసం ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల పథకాలను ప్రకటించటంతో ఇపుడు చాలా బ్యాంకులు తమ FD (ఫిక్స్‌డ్ డిపాజిట్) వడ్డీ రేట్లను కాస్త సవరించాయి.అదేవిధంగా కొన్ని కొత్త FD పథకాలను కూడా ప్రవేశ పెట్టాయి.
ఇక కొన్ని సంస్థలు అయితే పెద్ద పెద్ద బ్యాంకుల కంటే కూడా ఎక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే సీనియర్ సిటిజన్ల కోసం 1,001 రోజుల పథకాన్ని ప్రవేశపెట్టి, దానికోసం గరిష్ఠంగా 9.5% వడ్డీ రేటును ఇపుడు అందిస్తోంది.

అదేవిధంగా “సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్” సీనియర్ సిటిజన్లకు 999 రోజుల కాలవ్యవధికి అత్యధికంగా 8.76 శాతం వడ్డీ రేటును ప్రకటించడం విశేషం.ఇక ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గత 2 ఏళ్లగా 999 రోజుల సేవింగ్స్ స్కీమ్స్ కు 8.51 శాతం వడ్డీ రేటును అందిస్తోన్న సంగతి తెలిసినదే.అదే విధంగా దేశంలో అతిపెద్ద మైక్రో ఫైనాన్స్ సంస్థ అయిన “జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్” 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, FD ప్లస్ పథకాలను అందిస్తోంది.

అలాగే దేశంలోని పెట్టుబడిదారులకు “బంధన్ బ్యాంక్” 3 శాతం నుంచి 8.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందించడం విశేషం.ఇంకా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, సాధారణ ఇన్వెస్టర్లలో పోల్చినప్పుడు సీనియర్లకు అదనంగా 0.75 శాతం వడ్డీని చెల్లించడం గమనార్హం.ఇక సీనియర్ సిటిజన్లు IDBI నమన్ సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల క్రింద 0.75 శాతం వరకు అదనపు వడ్డీ రేటును ఇవ్వడం కొసమెరుపు.ఈ పథకం కింద కనీస డిపాజిట్ మెుత్తం రూ.10,000 ఉండగా.గరిష్ఠ పరిమితి రూ.2 కోట్లకు అనుమతించబడుతోంది.







