మార్కెట్లోకి కిస్సింగ్ డివైస్ కూడా వచ్చేసింది... ఇపుడు మీరు దూరం నుండే ముద్దు పెట్టుకోవచ్చు!

రోజురోజుకీ టెక్నాలజీ పెరిగి పోతుంది.దాంతో టెక్నాలజీకి అనుగుణంగానే మనిషి జీవన శైలి కూడా మారిపోతోంది.

 China Man Discovered Remote Kissing Device Details, Kissing Device, New Technolo-TeluguStop.com

అవును, ఇక పెరిగిపోయిన టెక్నాలజీని వాడుకోవడానికి ప్రతి ఒక్కరు ఇపుడు ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు.కూర్చున్న చోటికే తమకు కావలసిన వస్తువులను తెప్పించుకుంటూ సామాన్యులు సైతం విలాసవంతమైన జీవితాన్ని ఇపుడు గడపగలుగుతున్నారు.

ఒకప్పుడు సంపన్నులు మాత్రమే పని వాళ్ళని పెట్టుకొని కావలసినవి దగ్గరికి తెప్పించుకోవడం చేసేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

Telugu China, Gadgets, Smart, Remote, Smart Phone, Tech, Xiang-Latest News - Tel

స్మార్ట్ ఫోన్లో ఒక్క క్లిక్ ద్వారా అన్ని వస్తువులను తమ ఇంటి ముందుకే తెప్పించుకోగలుగుతున్నారు.అయితే ఇలా కావాల్సిన వస్తువులను మాత్రమే కాకుండా టెక్నాలజీ ఏకంగా ఒక మనిషికి సాటి మనిషికి తీర్చాల్సిన అన్ని అవసరాలను కూడా తీర్చేస్తుంది అని చెప్పాలి.ఒక యువకుడు ఏకంగా కిస్సింగ్ డివైస్ ని కనిపెట్టేసాడు.కిస్సింగ్ డివైస్ ఏంటి? అనే అనుమానం వస్తుంది కదూ.అవును, మీ అనుమానం నిజమే.దీనిని కిస్ చేస్తే అచ్చం ఎదుటి మనిషిని కిస్ చేసిన అనుభూతి కలుగుతుంది.

ఎక్కడో దూరంలో ఉన్నవారికి దీని సహాయంతో ముద్దు పెట్టవచ్చన్నమాట.

Telugu China, Gadgets, Smart, Remote, Smart Phone, Tech, Xiang-Latest News - Tel

చైనాలోని ఒక యూనివర్సిటీకి చెందిన జియాంగ్ అనే వ్యక్తి దీన్ని కనుగొనగా ఇపుడు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు.దూరంగా ఉన్న ప్రియురాలి కోసమే ఓ యాప్ తో పాటు సిలికాన్ మెటీరియల్ తో లిప్స్ డివైస్ ను తయారు చేసాడట మరి.చార్జింగ్ పోర్ట్ ద్వారా ఈ డివైస్ ను కనెక్ట్ చేసి యాప్ సాయంతో వీడియో కాల్స్ ద్వారా ముద్దు పెట్టుకోవచ్చు.దీని ప్రత్యేకత ఏమంటే, మీకు రియల్ అనుభవం ఇస్తుంది.అవతల వ్యక్తి ఎంత గాఢంగా కిస్ పెడితే ఇవతల వున్న వ్యక్తికి అంత గాఢతగా ముద్దు చేరుతుంది.

ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube