ప్రస్తుతం భారత జట్టు వైస్ కెప్టెన్ ఎవరు అనే చర్చ మొదలైంది.కేఎల్ రాహుల్ కు వరుస వైఫల్యాలు వెంటాడడంతో వైస్ కెప్టెన్ పదవే కాకుండా చివరకు జట్టులో కూడా స్థానం కోల్పోయాడు.
ఇండియా- ఆస్ట్రేలియా తదుపరి రెండు టెస్టులకు వైస్ కెప్టెన్ ఎవరో సెలెక్టర్లు ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.అయితే అభిమానులకు నచ్చని వ్యక్తి పేరును వైస్ కెప్టెన్ గా హర్భజన్ సింగ్ ప్రతిపాదించడంతో, సింగ్ పై ట్రోల్స్ చేస్తున్నారు.
హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ ఛానల్ లో భారత జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ను కాకుండా శుభ్ మన్ గీల్ ను ఓపెనర్ బ్యాట్ మెన్ గా ఆడిస్తారా, వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజాను ఎంపిక చేయొచ్చు కదా అని చేసిన వ్యాఖ్యలను తానే స్వయంగా ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.క్రికెట్ అభిమానులు ట్రోల్స్ చేస్తూ అశ్విన్ కూడా అద్భుత ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు కదా, ఎందుకు అశ్విన్ ను తక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నావంటూ, అశ్విన్ నీకంటే గొప్ప ప్లేయర్ గా రాణిస్తుంటే తట్టుకోలేకపోతున్నావా, అంటూ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇటీవలే జరిగిన రెండు మ్యాచ్లలో జడేజా అద్భుతంగా రాణించడంతో టెస్ట్ మ్యాచ్లకు, వన్డే మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ చేయాలనే తన పోస్టులో వైస్ కెప్టెన్ కు బదులుగా వీసా కెప్టెన్ అని పొరపాటుగా రాశాడు.పొరపాటును గుర్తించి పోస్ట్ డిలీట్ చేసే లోపే అది క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిలో పడింది.రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా విఫలం అయ్యాడు, అతనిపై ఒత్తిడి తెస్తే ఆట తీరు దెబ్బ తింటుంది కదా అంటూ హర్భజన్ సింగ్ కు క్లాస్ పీకుతూ, వైస్ కె కెప్టెన్ ఎవరు అని జోకులతో హేళన చేస్తున్నారు.తాజాగా వైస్ కెప్టెన్ రేసులో శ్రేయస్ అయ్యర్ తో పాటు పూజారా ఉన్నట్లు తెలుస్తుంది.
బీసీసీఐ తదుపరి రెండు టెస్ట్ మ్యాచ్లకు వైస్ కెప్టెన్ ఎంపిక చేయకపోవడం, హర్భజన్ సింగ్ కామెంట్స్ లపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.