బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ గత ఏడాది డిసెంబర్ లో రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన విషయం తెలిసిందే.ఫిలిం ఫెస్టివల్ లో ఓ పాకిస్థాన్ నిర్మాత ఒకరు రణ్ బీర్ ను కలిసి ఓ మాట అడిగాడు.
పాకిస్థానీ సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా అని అడగగా అప్పుడు రణ్ బీర్ కచ్చితంగా నటిస్తాను, ఆర్టిస్టులకు, కళలకు హద్దులు ఉండవని నేను నమ్ముతాను అని అన్నారు.ఇక రణబీర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.
రణ్ బీర్ దేశ వ్యాప్తంగా వివాదం అయ్యాయి.సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ రణ్ బీర్ పై దారుణంగా ట్రోల్స్ చేశారు.

పాకిస్థాన్ సినిమాల్లో నటిస్తాను అని ఎలా చెప్పగలిగావు అంటూ రణ్ బీర్ కపూర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.అయితే గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు తాజాగా క్లారిటీ ఇచ్చాడు రణ్ బీర్ కపూర్.ప్రస్తుతం నటిస్తున్న తు ఝూతి మైన్ మక్కార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క వరుస ఇంటర్వ్యూలతో పాటు, వరుసగా ఈవెంట్స్ లో పాల్గోంటున్నాడు.నేపథ్యంలోనే పాకిస్తాన్ సినిమాలలో నటిస్తాను అన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.
నేను మాట్లాడిన మాటలు తప్పుగా అర్ధం చేసుకున్నారు.నేను ఆ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళాక అక్కడికి చాలా మంది పాకిస్థాన్ సినీ పరిశ్రమ వాళ్ళు కూడా వచ్చారు.
అలాంటి సందర్భంలో ఈ ప్రశ్న అడిగారు.

అప్పుడు అక్కడ వివాదం అవ్వకూడదు అని నేను నటిస్తాను అని చెప్పాను.నాకు సినిమాలే ముఖ్యం.నాకు చాలా మంది పాకిస్థాన్ సినీ వ్యక్తులు తెలుసు.
వాళ్ళు ఇండియన్ సినిమాల్లో పనిచేస్తున్నారు.సినిమాకు, కళకు హద్దులు ఉండవని నేను నమ్ముతాను అని చెప్పుకొచ్చారు రణ్ బీర్ కపూర్.
మరి ఇప్పటికైనా నెటిజన్స్ రణ్ బీర్ పై టోల్స్ ని ఆపుతారో లేదో చూడాలి మరి.







