తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అంజలా ఝవేరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈతరం ప్రేక్షకులకు ఈమె అంతగా తెలియకపోవచ్చు కానీ ఆతరం ప్రేక్షకులు ఈమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు.
టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా సినిమాలో పక్కింటి అమ్మాయి కావేరి పాత్రలో నటించిన బ్యూటీయే ఈ అంజలా ఝవేరి.మొదటి సినిమాతో తనదైన నటనతో ఆకట్టుకుంది.
తరువాత రెండో సినిమాకే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన చిత్రం చూడాలని ఉంది.1998లో విడుదలైన ఈ చిత్రంలో సౌందర్య మొదటి హీరోయిన్ కాగా అంజలా ఝవేరి సెకండ్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.చూడాలని ఉంది సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే తెలుగులో రావోయి చందమామ, దేవీ పుత్రుడు, ప్రేమ సందడి లాంటి హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించి ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ మూవీల్లో నటించి అలరించింది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది అంజలా ఝవేరి.ఇక ఈ భర్త మరెవరో కాదు నటుడు తరుణ్ అరోరా.
తరుణ్ తెలుగులో ఎన్నో సినిమాలలో విలన్ క్యారెక్టర్ లలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.తరుణ్ అరోరా కూడా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.
ఒకప్పుడు హీరోయిన్ గా తన అందంతో ఒక వెలుగు వెలిగిన ఈమె ప్రస్తుతం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







