ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పేరు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువుగా వింటూ ఉంటున్నాం.ఎందుకంటే ఇది ఇండియన్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.టాలీవుడ్ నుండి ఆల్ టైం బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ నుండి ఏ అప్డేట్ వచ్చిన సంచలనమే అవుతుంది.
రౌద్రం రణం రుధిరం సినిమాను అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసాడు.
మన స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది.
ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న వరల్డ్ వైడ్ గా చర్చ జరుగుతూనే ఉంది.ప్రపంచ ఆడియెన్స్ ను ఎంతగానో ఎలరించిన ఈ సినిమాలో చార్ట్ బస్టర్ గా నిలిచిన సాంగ్ ‘నాటు నాటు’.

ఈ సాంగ్ ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం ఆస్కార్ కు నామినేట్ కావడం తెలుగు ఆడియెన్స్ కు అలాగే టీమ్ అందరికి గర్వించదగ్గ మూమెంట్ వచ్చింది.ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డులకు నామినేట్ కావడంతో ఈ సినిమాకు మన సినీ ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఇక తాజాగా ఈ సాంగ్ పై కోరియన్స్ కవర్ సాంగ్ చేయగా దీనిపై ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడం సంచలనం రేపుతోంది.

ఈ సాంగ్ చూడ్డానికి ఎంతో బాగుంది.టీమ్ ఎఫర్ట్స్ ఒరిజినల్ కు దగ్గరగా ఉన్నాయి అని మోదీ స్పందించారు.మరి ఆస్కార్ కు దగ్గరవుతున్న వేళ మోదీ నుండి నాటు నాటు సాంగ్ గురించి రెస్పాన్స్ రావడం మరింత ఆసక్తిగా మారింది.
దీంతో ఈ సాంగ్ గురించి మరోసారి చర్చ జరుగుతుంది.ఇది ఆస్కార్ కు ప్లస్ అవుతుంది అనే చెప్పాలి.చూడాలి ఆస్కార్ తెలుగు సినిమాకు వరిస్తుందో లేదో.







