సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలో వారికి సంబంధించిన విషయాలన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
అయితే సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎంత ఆదరణ ఉంటుందో అదే స్థాయిలో వారిని ట్రోల్ చేస్తూ ఉంటారు.ఇలా పలువురు సెలబ్రిటీలు వారి గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందిస్తూ ఘాటుగా సమాధానాలు చెబుతూ ఉంటారు.
మరి కొందరు చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే నటి రితికా సింగ్ సైతం సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్, నెగిటివ్ కామెంట్లపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రితికా సింగ్ 2017వ సంవత్సరంలో హీరో వెంకటేష్ నటించిన గురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.అనంతరం ఈమె తెలుగులో శివలింగ, నీవెవరో వంటి సినిమాలలో నటించారు.
అయితే తాజాగా కార్ చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందించారు.

ఈ సందర్భంగా రితిక సింగ్ మాట్లాడుతూ…సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి నెగటివ్ కామెంట్లు ట్రోల్స్ తనని చాలా బాధపెట్టాయని వాటిని చూసి ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయిందని తెలియజేశారు.అలాంటి ట్రోల్స్ నన్ను మానసికంగా కృంగదీసాయని కూడా తెలియజేశారు.నాకంటూ ఓ ఫ్యామిలీ ఉంది నా ఫ్యామిలీ మెంబర్స్ వీటిని చూస్తే వాళ్లు కూడా బాధపడతారు.
ఆడవారికి అందరూ గౌరవం ఇవ్వాలి.ఒక సెలబ్రెటీ అయినా.
మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా ఒకే రకమైన గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను మిడిల్ క్లాస్ అమ్మాయి అయినంత మాత్రాన చులకనగా చూడకూడదు కదా అంటూ ఈమె మహిళల పట్ల సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







