జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న పంచ్ ప్రసాద్ పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడిన సంగతి తెలిసిందే.తాజాగా పంచ్ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన కీలక విషయాలను చెప్పుకొచ్చారు.
పెళ్లైన కొత్తలో నా ముక్కులో నుంచి రక్తం వచ్చేదని ఆస్పత్రికి వెళ్లగా కిడ్నీలు పాడయ్యాయని తెలిసిందని పంచ్ ప్రసాద్ అన్నారు.
కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లలో ఒక్కొక్కరికీ ఒక్కోలా ఎఫెక్ట్ ఉంటుందని కాలుకు చీము రావడం వల్ల నడవలేని స్థితికి వెళ్లిపోయానని పంచ్ ప్రసాద్ వెల్లడించారు.
ప్రస్తుతానికి స్వల్పంగా కోలుకున్నానని షోలు కూడా చేసుకుంటున్నానని పంచ్ ప్రసాద్ తెలిపారు.షోలు కూడా చేసుకుంటున్నానని ఇప్పుడు బాగానే నడుస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు.త్వరలో ఆపరేషన్ కూడా చేయించుకోనున్నానని ఆయన కామెంట్లు చేశారు.

గతంలో కాలుకు చీము రావడం వల్ల ఆపరేషన్ ను వాయిదా వేయడం జరిగిందని పంచ్ ప్రసాద్ అన్నారు.ఇప్పటికే కిడ్నీ డోనర్ దొరికారని పంచ్ ప్రసాద్ తెలిపారు.తాను త్వరగా కోలుకోవాలని చాలామంది ప్రార్థించారని ఆయన కామెంట్లు చేశారు.
కాలు నొప్పి తగ్గిన తర్వాతే ఆపరేషన్ చేస్తానని వైద్యులు చెప్పడం జరిగిందని పంచ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.ఒక ఫ్యాన్ తనకోసం తిరుపతికి కాలినడకన వెళ్లారని ఆయన కామెంట్లు చేశారు.

నన్ను ఇంతగా అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారా అని అనిపించిందని పంచ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.పంచ్ ప్రసాద్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పంచ్ ప్రసాద్ వరుస ఆఫర్లతో బిజీ కావాలని మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.పంచ్ ప్రసాద్ ఈటీవీ షోల ద్వారా నెలకు 3.5 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.పంచ్ ప్రసాద్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.







