గౌతమ్ మీనన్. తమిళంలో దర్శకుడుగా తన ప్రయాణం మొదలుపెట్టి తెలుగు, హిందీ సినిమాలకు సైతం దర్శకత్వం వహించి ఆ తర్వాత దర్శకత్వానికి కొద్ది రోజులపాటు విధానం ప్రకటించి ప్రస్తుతం నటుడుగా కెరియర్ నీ కొనసాగిస్తున్నాడు.
తెలుగులో వెంకటేష్ హీరోగా ఘర్షణ సినిమాను తొలిసారిగా డైరెక్ట్ చేసిన గౌతమ్ మేనన్ ఆ తర్వాత నాగచైతన్య సమంత హీరో హీరోయిన్స్ గా ఏ మాయ చేసావే సినిమా తీశారు.ఈ సినిమాను తెలుగులో సమంత మరియు నాగచైతన్య తో తీయగా తమిళ్ లో శింబు మరియు త్రిష కాంబినేషన్ లో ఒకేసారి తెరకెక్కించి రెండు సినిమాలు విజయవంతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు గౌతమ్ మీనన్.
ఇక ఇటీవల తెలుగులో సీతా రామం సినిమాలో మిలట్రీ ఆఫీసర్ గా నటించిన గౌతమ్ మీనన్ మైఖేల్ సినిమాతో పూర్తిస్థాయి విధంగా అవతారం ఎత్తారు.ఇన్ని భాషల్లో దర్శకత్వం వహిస్తున్న గౌతమ్ మీనన్ కి నటుడుగా మారాలన్న తహతహ ఎందుకు మొదలైందో తెలియదు కానీ భిన్నమైన వ్యక్తిత్వం తో బాడీ లాంగ్వేజ్ తో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రస్తుతం ఉన్న నటులకు సవాల్ విసురుతున్నారు.
ఇక స్వతహాగా మలయాళీ అయిన గౌతం మొట్టమొదటిసారిగా మాధవన్ హీరోగా చెలి అనే సినిమాకు దర్శకత్వం వహించారు.తెలుగులో ఏ మాయ చేశావే సినిమా తర్వాత ఎటో వెళ్లిపోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమాలకు కూడ దర్శకత్వం వహించారు.గౌతమ్ మీనన్ కేవలం నటుడు దర్శకుడు మాత్రమే కాదు నిర్మాతగా కూడా మారి పలు సినిమాలను నిర్మించాడు అంతేకాదు
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు పాత్రలకు గాత్ర దానం కూడా చేశాడు.ఇక పాత్ర నచ్చితే షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించడానికి వెనుకాడడం లేదు.గత 20 ఏళ్లుగా ఏదో ఒక పాత్రలో కనిపిస్తూ ఉన్నాడు గౌతమ్.ఇక గౌతమ్ మీనన్ భవిష్యత్తు లో మరిన్ని తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్ధం అవుతున్న గౌతమ్ ప్రీతి మీనన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.
వీరికి ముగ్గురు పిల్లలు.