రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన ఆయన శిష్యుల్లో ఒక్కొక్కరు ఒక్కో టైపు గా ఉన్నారు అందులో కృష్ణ వంశీ మాత్రం క్రియేటివ్ గా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ అయ్యాడు.అయితే కృష్ణ వంశీ సినిమాల్లో ఎక్కువగా ప్రకాష్ రాజ్ గారిని రిపీట్ చేస్తూ ఉంటారు.
ఎందుకంటే వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది.అప్పట్లో ఇద్దరు కూడా రోజు నైట్ హైదరాబాద్ అంత కార్ లో తిరుగుతూ స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకునే వాళ్ళు అట దాంతో కృష్ణవంశీ రాసే కొన్ని క్యారెక్టర్స్ కి కూడా ప్రకాష్ రాజ్ అయితేనే న్యాయం చేయగలరని అనుకొని ఆయనతోనే ఆ క్యారెక్టర్స్ చేయించేవారట.

ఒక్కోసారి ఇద్దరు షూటింగ్ స్పాట్ లో గొడవ కూడా పడేవారట ఒక సీన్ బాగా తీయడానికి కృష్ణ వంశీ అనుక్షణం చాలా తాపత్రయ పడేవారట.అంతఃపురం సినిమా చేసే సమయం లో ప్రకాష్ రాజ్ చేసే క్యారెక్టర్ లో ఒక సీన్ కోసం ప్రకాష్ రాజ్ దాదాపు 20 టేకుల వరకు చేసిన కూడా కృష్ణ వంశీ గారికి నచ్చట్లేదట దాంతో ప్రకాష్ రాజ్ గారికి కోపం వచ్చి అసలు నీకేం కావాలిరా అని అడిగాడట దాంతో కృష్ణ వంశీ ఆ సీన్ గురించి అందులో ఆయన చేయాల్సిన యాక్టింగ్ గురించి వివరించగా ప్రకాష్ రాజ్ మళ్లీ బాగా చేసాడట, అప్పుడు కృష్ణ వంశీ ఒకే చేసిన షాట్ ప్రకాష్ రాజ్ కి పెద్దగా నచ్చలేదట.కానీ సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే ఆ సినిమా మొత్తం లో ప్రకాష్ రాజ్ గారి చేసిన ఆ సీన్ గురించే అందరు మాట్లాడుకుంటున్నారట, ప్రకాష్ రాజ్ ఆ సీన్ లో యాక్టింగ్ అదరగొట్టాడు అని అందరు అన్నారట ఇంతకు అది ఏ సీన్ అంటే సౌందర్య తన కొడుకుని తీసుకొని పారిపోతుంటే ప్రకాష్ రాజ్ తన వారసుడు అయినా ఆ పిల్లాడ్ని తిరిగి తన దగ్గరికి తెచ్చుకునే ప్రాసెస్ లో ఆయన చేసిన సీన్ అది.

అయితే ప్రకాష్ రాజ్ కృష్ణవంశీ కి కాల్ చేసి నేను ఆ సీన్ లో యాక్టింగ్ సరిగా చేయలేదు అనుకున్న కానీ నువ్వే అనవసరంగా షాట్ ఒకే చేసావ్ అని అనుకున్న కానీ ఇప్పుడు అదే నాకు బాగా పేరు తెచ్చింది అని చెప్పాడట ఎంతైనా నువ్వు గ్రేట్ డైరెక్టర్ వి వంశీ అని చెప్పాడట…అలా ఒక డైరెక్టర్ కి ఏం కావాలి అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అయితే కృష్ణ వంశీ ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా మంచి మిత్రులు సొంత అన్నదమ్ముల్లా ఉంటారు.కానీ వీళ్ల మధ్య కూడా ఒకసారి చిన్న గొడవ జరిగి కొద్దీ రోజులు మాట్లాడుకోలేదు మళ్లీ గోవిందుడు అందిరివాడేలే సినిమా నుంచి మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతం కృష్ణ వంశీ డైరెక్షన్ లో ప్రకాష్ రాజ్ లీడ్ రోల్ లో రంగ మార్తాండ అనే సినిమా వస్తుంది…
.







