స్టార్ యాంకర్ రష్మీ మూగజీవాల విషయంలో చూపించే ప్రేమ అంతాఇంతా కాదు.ఈ ప్రేమ విషయంలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేసినా రష్మీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
అయితే తాజాగా వీధికుక్కల వల్ల రష్మీపై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేయగా మరి కొందరు రష్మీకి కోపన్ తెప్పించేలా కామెంట్లు చేస్తున్నారు.తాజాగా ఒక వ్యక్తి రష్మీని కుక్కతో పోల్చుస్తూ కామెంట్ చేయగా ఆ కామెంట్ పై రష్మీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
ఈ కుక్క రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలని ఆ వ్యక్తి చెప్పగా రష్మీ రిప్లై ఇస్తూ తప్పకుండా.నీ అడ్రస్ చెప్పు.వచ్చి కలుస్తా అని అన్నారు.ఎలా కొడతావో చూస్తానని ఇదే నీకు నా ఛాలెంజ్ అని ఆమె కామెంట్ చేశారు.
మరి కొందరు యాంకర్ రష్మీపై బెదిరింపులకు పాల్పడుతున్నారు.రష్మీ అంబర్ పేట్ ఘటన గురించి స్పందిస్తూ కుక్కలు కూడా మనలా ప్రాణులని వాటికి స్పెషల్ గా వసతి కల్పించాలని అన్నారు.

ఆ కామెంట్లకు ఒక నెటిజన్ స్పందిస్తూ నీపై చేతబడి చేయిస్తానని నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండాలని కామెంట్ చేశారు.ఆవుల వల్ల యాక్సిడెంట్ అవుతాయా.నీపై యాసిడ్ పోస్తా అంటూ అని అన్నారు.ఆవుల గురించి నీలాంటి వాళ్లకు తెలియదని నోరు మూసుకుని ఉండాలని పేర్కొన్నారు.మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావని నెటిజన్ చెప్పుకొచ్చారు.

ఆ కామెంట్ పై రష్మీ స్పందిస్తూ ఆ అకౌంట్ అమ్మాయిదో అబ్బాయిదో తెలియదని ఇన్ని మాటలు అన్నందుకు ఈ వ్యక్తిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయాలా అని పేర్కొన్నారు.కొంతమంది నెటిజన్లు మాత్రం రష్మీకి సపోర్ట్ చేస్తున్నారు.రష్మీని అనవసరంగా నిందించవద్దని కామెంట్లు చేస్తున్నారు.
రష్మీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.







