గత కొన్ని దశాబ్దాల నుంచి బుల్లితెరను ఏకచక్రాధిపత్యంతో ఏలుతున్నటువంటి యాంకర్లలో యాంకర్ సుమ కనకాల ఒకరు.కెరీర్ మొదట్లో పలు సీరియల్స్ లో నటించిన ఈమె అనంతరం యాంకరింగ్ వైపు మళ్లారు.
ఇలా యాంకర్ గా స్పష్టమైన తెలుగులో మాట్లాడుతూ తన మాటతీరుతో ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి సుమ ఇప్పటికే వరుస సినిమా ఈవెంట్లు, సక్సెస్ మీట్, ప్రీ రిలీజ్ వేడుకలు అంటూ పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.అదేవిధంగా మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ కూడా వారంలో ఏడు రోజులు సుమా బిజీగా గడుపుతున్నారు.

ఇలా వరుస కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఏ కార్యక్రమానికి అయినా తను యాంకర్ గా వ్యవహరిస్తాను కానీ ఒక్క కార్యక్రమానికి మాత్రం తాను యాంకర్ గా వ్యవహరించనని అవసరమైతే తను యాంకరింగ్ అయినా మానేస్తాను కానీ ఆ షోకి మాత్రం యాంకర్ గా వ్యవహరించను అంటూ ఈమె తెలియజేశారు.అయితే సుమ ఏ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించనని చెబుతున్నారనే విషయానికి వస్తే ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా అసలు వ్యవహరించను అంటూ బల్లగుద్ది చెబుతున్నారు.

ఈ కార్యక్రమం మొదట్లో సుమను యాంకర్ గా తీసుకోవాలని భావించారట అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదు అనంతరం అనసూయ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో తిరిగి ఈ కార్యక్రమానికి సుమను తీసుకురావాలని మల్లెమాలవారు ప్రయత్నాలు చేసినప్పటికీ సుమ మాత్రం ఈ కార్యక్రమానికి చస్తే యాంకరింగ్ చేయనని తెలియజేశారట.అయితే సుమ ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేయకపోవడానికి కారణం ఉంది.సుమ ఏదైనా లిమిట్స్ వరకు మాత్రమే చేస్తుందని కానీ హద్దు మీరితే మాత్రం తాను సహించరనే విషయం మనకు తెలిసిందే.ఇక జబర్దస్త్ షో ఎలాంటిదో మనకు తెలిసిందే.
కొన్నిసార్లు కమెడియన్స్ యాంకర్లపై కూడా సెటైర్లు వేస్తూ స్కిట్లు చేస్తుంటారు.అందుకే సుమ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు నువ్వెప్పుడూ నీలాగే ఉండు సుమక్క అంటూ కామెంట్లు చేస్తున్నారు.







