కొందరు సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలపై బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఎప్పటికప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
ఇక ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు వెంటనే తెలుసుకుంటున్నారు.అంతేకాకుండా వారికి కొన్నికొన్ని సార్లు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు.
కొన్ని సార్లు నెటిజన్స్ సలహాలను సెలెబ్రెటీల ఫాలో అవుతుంటారు.మరి కొన్నిసార్లు ఫైర్ అవుతూ వారికి కౌంటర్లు వేస్తూ ఉంటారు.
అయితే తాజాగా నటి వితికా షేరు కూడా తనకు ఓ నెటిజన్ సలహా ఇవ్వటంతో వెంటనే కౌంటర్ వేసింది.ఇంతకు ఆ నెటిజెన్ ఇచ్చిన సలహా ఏంటి.
ఆమె తిరిగి ఏమని సమాధానం ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి వితికా షేరు.అంతేకాకుండా ఈమె భర్త ఎవరో కాదు సినీ నటుడు వరుణ్ సందేశ్.2016లో వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.వితికా చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా నటనపరంగా కూడా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఈమె సినీ ఇండస్ట్రీకి కేవలం 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అడుగు పెట్టింది.అలా కన్నడ భాషలో పలు సినిమాలలో చేసింది.టాలీవుడ్ ఇండస్ట్రీకి 2008లో పరిచయమయ్యింది.ప్రేమించు రోజుల్లో, ఛలో, మై నేమ్ ఇస్ అమృత వంటి పలు సినిమాలలో నటించి తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది.
తర్వాత కొన్ని సినిమాలలో సహాయనిటిగా కూడా చేసింది.తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది.ఆ తర్వాత తనతో కలిసి నటించిన వరుణ్ సందేశ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోగా కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ తో తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది.2019లో మాటీవీలో ప్రసారమైన బిగ్బాస్ తెలుగు సీజన్ 3 లో తన భర్తతో పాటు తను కూడా కంటెస్టెంట్ గా పాల్గొని బాగా సందడి చేసింది.

ఇక బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.నిత్యం తన డాన్స్ వీడియోలను, వ్యక్తిగత విషయాలను బాగా షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఈమధ్య బాగా వర్కౌట్లు చేస్తూ మంచి ఫిజిక్ కూడా సంపాదించుకుంది.ఫోటోషూట్ లు కూడా చేయించుకుంటూ బాగా సందడి చేస్తుంది.
అయితే తాజాగా తను ఒక హాట్ వీడియో వదిలింది.అందులో తన నడుము అందాలతో బాగా ఎక్స్పోజ్ చేసింది.
పైగా మంచి ఫిజిక్ తో కనిపించింది.ఆ వీడియో చూసిన తన అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు.
కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.అయితే ఓ నెటిజన్.
మీరు జిమ్ లేదా డైట్ చేయడం ఒక నెల మానేయండి.అప్పుడు నువ్వు మళ్ళీ యధావిధిగా అంతకుముందు ఎలా ఉన్నావో అలా మారిపోతావు అంటూ కామెంట్ చేయగా వెంటనే.
వెతికా కాస్త ఫైర్ అయినట్లు కనిపించింది.ఎందుకు మానాలి.
సరదా నాకా.అంత సరదా నాకు లేదు.
అంటూ తిరిగి కౌంటర్ వేసింది.వెంటనే అతడు ఒకవేళ గ్యాప్ వస్తే అని చెబుతున్నాను అంటూ.
మీరు మానకండి అదే చెప్తున్నా.అంటూ తిరిగి రిప్లై ఇచ్చారు.
ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వైరల్ అవుతుంది.







