బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెబుతూ వెండితెర సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వెండితెరపై వరుస సినిమాలలో వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
తనకు తోచిన విషయాన్ని ఏమాత్రం నిర్మొహమాట పడకుండా కుండలు బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ సమాధానాలు చెబుతుంటారు.ఇక తన గురించి ఎవరైనా ట్రోల్ చేసినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వారికి లెఫ్ట్ రైట్ ఇస్తుంది.

ఇలా సోషల్ మీడియా ద్వారా కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అనసూయ తనుకు వీలు కుదిరినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కలిసి ముచ్చటించారు.అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ అనసూయను విభిన్న రీతిలో ప్రశ్నించారు.

ఈ సందర్భంగా సదరు నెటిజన్ అనసూయని ప్రశ్నిస్తూ.మీరు నిజంగా లిబరల్ మెచ్యూర్డ్ ఉమెన్ అయితే నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి.మీకు ఎప్పుడైనా లెస్బియన్స్ తో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అనసూయ ఏమాత్రం జంకకుండా నిర్మొహమాటంగా సమాధానం చెప్పింది.మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో కూడా లెస్బియన్స్ ఉన్నారు.పర్సనల్ గా అయితే లెస్బియన్స్ తో అలాంటి అనుభవాలు ఎదురు కాలేదు కానీ ఆన్లైన్ లో మాత్రం చాలాసార్లు ఇలాంటి అనుభవం ఎదురైంది అంటూ ఈమె చెప్పినటువంటి ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







